SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » What Is Bulli Bai Sulli Deals In Telugu

బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ అంటే ఏమిటి? వీళ్ళు అసలు మనుషులేనా?

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Mon - 3 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ అంటే ఏమిటి? వీళ్ళు అసలు మనుషులేనా?

అనాదిగా మహిళలను చిన్న చూపు చూస్తున్న సమాజం మనది. అంతరిక్షంలోకి వెళ్తున్నప్పటికి.. అతివల పట్ల సమాజ ధోరణిలో ఏ మాత్రం మార్పు లేదు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అని గొప్పగా చెప్పుకుంటాం కానీ.. ఆచరణలో మాత్రం వారికి వీసమెత్తు గౌరవం ఇవ్వం. ఆమె ఆశలు, ఆశయాల్ని కట్టడి చేస్తాం. ఎదగడానికి ప్రయత్నించిన ప్రతి సారి ఆమె రెక్కలను బలంగా దెబ్బ కొడతాం. కుదరకపోతే ఆమె ఆత్మ గౌరవం, పరువు ప్రతిష్టలను బజారు పాలు చేసి ఆనందిస్తాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. వందలాది మంది ముస్లిం మహిళల ఫోటోలను సేకరించి.. వాటిని ఆన్ లైన్ లో వేలానికి పెట్టి.. దారుణమైన వికృత చేష్టలకు పాల్పడింది ఓ యాప్. ప్రస్తుతం ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

All lies @DelhiPolice! you have never provided me a copy of FIR registered on my complaint dt 12/07/21 against the violation of my dignity and crimes committed against me re. Sulli Deals. I am still waiting for it. It’s been 5 months already. What action will you take this time? https://t.co/I8LZP4XzCa

— Nabiya Khan | نبیہ خان (@NabiyaKhan11) January 1, 2022

సుమారు ఆరు నెలల క్రితం ముస్లిం మహిళల ఫోటోల విషయంలో అబాసుపాలైన గిట్ హబ్ అనే ప్లాట్ ఫాం మరోసారి అదే రకమైన వికృత చేష్టలకు వేదిక అయ్యింది. ఈ సారి బుల్లి బాయ్ అనే యాప్ గిట్ హబ్ లో సుల్లీ డీల్స్ పేరిట వందలాది ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి పెట్టింది. దీనిలో పాల్గొనాల్సిందిగా యూజర్లును కోరుతూ.. రాక్షసానందం పొందుతుంది. దారుణం ఏంటంటే ఈ యాప్‌ లో అప్ లోడ్ చేసిన ఫోటోల్లో సామాన్య ముస్లిం యువతుల నుంచి.. ప్రముఖ డాక్టర్లు, జర్నలిస్ట్ లు, వివిధ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న వారి ఫోటోలు కూడా ఉండటం గమనార్హం. ‘బుల్లి బాయ్ ఆఫ్ ది డే’ గా ద వైర్ జర్నలిస్ట్ ఇస్మత్ ఆరా ఫోటోను ఈ యాప్ లో వేలానికి పెట్టారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తన ట్విటర్ లో షేర్ చేశారు ఇస్మత్ ఆరా.

Muslim app Viral

“ఓ ముస్లిం మహిళగా నేను ఈ కొత్త సంవత్సరాన్ని భయం, అసహ్యంతో ప్రారంభించాల్సి రావడం చాలా బాధాకరం. అయితే ఈ సుల్లీ డీల్స్ కొత్త వెర్షన్ నన్ను ఒక్కదాన్నే మాత్రమే టార్గెట్ చేయలేదని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉదయం నా ఫ్రెండ్ ఒకరు ఈ స్క్రీన్ షాట్ ను నాకు పంపించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు ఇస్మత్. అంతేకాక దీనిపై ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దేశ రాజధాని పోలీసులు కూడా తాము ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Have spoken to @CPMumbaiPolice and DCP Crime Rashmi Karandikar ji. They will investigate this. Have also spoken to @DGPMaharashtra for intervention. Hoping those behind such misogynistic and sexist sites are apprehended. https://t.co/Ofo1l9dgIl

— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 1, 2022

శివసేన మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ దారుణంపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రియాంక చతుర్వేది ‘‘‘బుల్లి బాయ్’ యాప్ లో దర్శనమిస్తున్న ‘సుల్లీడీల్స్’ వంటి చర్యల ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే కాక.. వారిపై ద్వేషాన్ని రగిలిస్తూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవనీయులైన ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కోరుతున్నాను. అలానే నేను ముంబై పోలీస్ కమిషనర్, డీసీపీ క్రూమ్ రష్మీ కరాండీకర్ తో కూడా నేను దీని గురించి మాట్లాడాను. వారు దీని గురించి పూర్తిగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. అలానే మహారాష్ట్ర డీజీపీని ఈ విషయంలో జోక్యం చేసుకుని.. ఇటువంటి స్త్రీ ద్వేషపూరిత, సెక్సిస్ట్ సైట్ల వెనుక ఉన్న వారిని అరెస్టు చేస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ప్రియాంక చతుర్వేది వరుస ట్వీట్లు చేశారు.

దీనిని సుమోటోగా తీసుకున్నామని, దీనిపై దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని ముంబయి పోలీసులు తెలిపారు. “ముంబయి సైబర్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారని ముంబయి పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ట్విటర్లో చురుగ్గా ఉండే ముస్లిం మహిళలు ‘బుల్లీ బాయి’ యాప్‌ లో అప్ లోడ్ చేసిన తమ ఫొటోల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో.. కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. “ఈరోజు ఉదయమే ఈ యాప్ ని బ్లాక్ చేశామని గిట్ హబ్ తెలిపింది. సీఈఆర్టీ, పోలీసులు దీనిపై మరిన్ని చర్యలు తీసుకుంటారు’’ అని అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.

It is very sad that as a Muslim woman you have to start your new year with this sense of fear & disgust. Of course it goes without saying that I am not the only one being targeted in this new version of #sullideals. Screenshot sent by a friend this morning.

Happy new year. pic.twitter.com/pHuzuRrNXR

— Ismat Ara (@IsmatAraa) January 1, 2022

గిట్ హబ్ స్పందన
ఈ ఓపెన్ సోర్స్ యాప్ ని ‘గిట్ హబ్’లో సృష్టించారు. ‘గిట్ హబ్’ అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కమ్యూనిటీ. సోమవారం నాడు ‘సుల్లీ డీల్స్’ యాప్ను గిట్ హబ్ తొలగించింది. ”మేం ఆ యూజర్ ఎకౌంట్ ను నిలిపేశాం. ఫిర్యాదులు రావడంతో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ చర్యలు వేధింపులు, వివక్ష, హింసను ప్రోత్సహించడం కిందికి వస్తాయి. ఇది గిట్ హబ్ నిబంధనలను ఉల్లంఘించడమే. ఇలాంటి వాటిని మేం ప్రోత్సహించం” అని సమాధానం ఇచ్చింది. అకౌంట్ నిలిపేశామని తెలిపిన ‘గిట్‌ హబ్‌’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్.. ఇదంతా ఎలా జరిగిందో మాత్రం చెప్పలేక పోయారు.

‘సుల్లీ డీల్స్’ అంటే ఏంటి?
ఆరు నెలల క్రితం అనగా.. జూలై 4, 2021న గిట్ హాబ్ యాప్ కు చెందని ఓ గుర్తు తెలియని గ్రూప్ సుల్లీ డీల్స్ పేరిట వందలాది ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి పెట్టింది. ఈ యాప్ క్రియేటర్స్ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వారి ఫోటోలను వారి అనుమతి లేకుండా సేకరించి.. తప్పుడు పనులకు వాడారు. ఈ ఫోటోలను మార్ఫ్ చేసి ట్రోల్ చేయడమే కాక.. వేలానికి పెట్టి.. రాక్షసానందం పొందారు. మరో సారి ఇదే రకమైన వికృత క్రీడకు తెరతీసింది. ఈ సారి బుల్లి బాయ్ పేరిట ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి పెట్టింది.

Months after two FIRs were filed by the #Delhi and #UP Police in the ‘#SulliDeals‘ controversy, no action has been taken against the perpetrators. Meanwhile on 1 Jan, in a repeat of the incident, women woke up to their photos being misused.https://t.co/Wr8lXi1VFE

— The Quint (@TheQuint) January 1, 2022

‘బుల్లి బాయ్’ యాప్ వివరాలు
గిట్ హబ్ అనే ప్లాట్ ఫాంలో ఈ బుల్లి బాయ్ యాప్ అందుబాటులో ఉంది. సోషల్ మీడియా యూజర్లు తెలిపిన వివరాల ప్రకారం.. యూజర్లు ఈ యాప్ ని ఒపెన్ చేయగానే.. ముస్లిం మహిళల ఫోటోలను బుల్లి బాయ్ పేరుతో చూపిస్తోంది. ట్విటర్లో చురుగ్గా ఉండే మహిళల ఫొటోలు, పేర్లను ఇందులో ఉపయోగిస్తున్నారు. ఆ మహిళల ఫొటో కింద బుల్లీ బాయ్ అని రాస్తారు. ఈ యాప్ ద్వారా సదరు మహిళలతో డీల్ చేసుకోవచ్చని ఇందులో చెబుతున్నారు.

గిట్ హబ్ అంటే ఏంటి?
నివేదికల ప్రకారం గిట్‌ హబ్‌ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్‌ ఫాం. ఇది యూజర్లు అప్లికేషన్ క్రియేట్ చేయడానికి, షేర్ చేసుకోడాన్ని అనుమతిస్తుంది. గిట్ హబ్‌ లో ఎవరైనా వ్యక్తిగత, సంస్థ పేరుతో యాప్ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి తోడు మనం ఆ యాప్ ని గిట్ హబ్ మార్కెట్ ప్లేస్‌ లో అమ్మవచ్చు, షేర్ చేసుకోవచ్చు.

GitHub confirmed blocking the user this morning itself.
CERT and Police authorities are coordinating further action. https://t.co/6yLIZTO5Ce

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 1, 2022

ఓపెన్ సోర్స్ ఫ్లాట్ ఫామ్ లు ఎలా పని చేస్తాయి?
ఓపెన్ సోర్స్ కోడ్ అంటే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. బయటి వ్యక్తులు ఈ కోడ్‌ కి కొత్త ఫీచర్లు జత చేయడం, లోపాలుంటే సరి చేయడంలాంటివి చేయవచ్చు. ఒకవేళ ఈ యాప్‌ ని డిజైనర్ తొలగించినా, డొమైన్ నేమ్ సిస్టమ్ ప్రొవైడర్ దగ్గర దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ”సుల్లీ ఫర్ సేల్” యాప్ ప్రస్తుతం గిట్‌ హబ్‌ నుంచి తొలగించారు. కాబట్టి.. దానిని ఎవరు రూపొందించారు అనే సమాచారం అందుబాటులో లేదు. మరి.. ఇంతటి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Bulli Bai
  • Delhi
  • GitHub
  • India
  • Latest Crime News
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

    సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

  • విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

    విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

  • ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

    ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

  • బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

    బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam