ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన సినిమా. బుట్టుబొమ్మ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మొన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన రాధేశ్యామ్ టీజర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
కేవలం రెండు రోజుల్లో 6 కోట్ల 30 లక్షల వీవ్స్ తో రాధే శ్యామ్ టీజర్ దూసుకుపోతోంది. ఈ టీజర్ లో విక్రమాదిత్యను పరిచయం చేశారు. ఈ టీజర్ తో రాధే శ్యామ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. త్వరలో ఈ మూవీ నుంచి మరో టీజర్ రాబోతోందని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది.
దీపావళి పండుగ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ టీజర్ తో చిత్ర బృందం సర్‌ప్రైజ్ చేయబోతోందని సమాచారం. ఇంకేముంది ప్రభాస్ అభిమానులకు దీపావళితో పాటు రాధే శ్యామ్ టీజర్ రూపంలో మరో పండగ రాబోతోందన్నమాట. అన్నట్లు ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా నటిస్తున్నారు.
అంతే కాదు బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ రాధే శ్యామ్ లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రసీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న రాధే శ్యామ్ 2022, సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.