ఐపీఎల్ లో నిన్నసన్ రైజర్స్ చెత్త ఆట తీరుని కొనసాగిస్తోంది. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ కీలకమైన దశలో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయింది. అయితే ఓటమికి కారణం ఏంటి అని పరిశీలిస్తే చాలానే విషయాలు కనబడతాయి. అయితే కెప్టె మార్కరం మాత్రం ఓటమికి నేనే బాధ్యుడని.. నా వల్లే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ తన చెత్త ఆట తీరుని కొనసాగిస్తోంది. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ కీలకమైన దశలో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయింది. సొంత గడ్డపై నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచులో 5 పరుగులు తేడాతో పరాజయం చవి చూసింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన దశలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మార్కరం సేనకు పరాజయం తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ పట్ల కెప్టెన్ మార్కరం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తన వల్లే మ్యాచ్ ఓడిపోయిందని కీలక వ్యాఖ్యలు చేసాడు.
ఐపీఎల్ లో నిన్న హైదరాబాద్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఓటమికి కారణం ఏంటి అని పరిశీలిస్తే చాలానే విషయాలు కనబడతాయి. టాప్ ఆర్డర్ ఒక్కరు కూడా గ్రీజ్ లో నిలబడలేకపోవడం ఒక కారణమైతే.. ప్రారంభంలో 3 కీలక వికెట్లు తీసినా కూడా 171 పరుగులు ఇవ్వడం మరో కారణం. దీనికి తోడు భారీ ఆశలు పెట్టుకున్న బ్రూక్ డకౌట్ కావడం కూడా మన జట్టు ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కెప్టె మార్కరం మాత్రం ఓటమికి నేనే బాధ్యుడని.. నా వల్లే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ మార్కరం మాట్లాడుతూ”ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఆఖరి ఓవర్లలో మేము మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ ఫినిష్ చేయడంలో మేము పూర్తిగా విఫలమయ్యాం. క్లాసేన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. కానీ నేనే ప్రారంభంలో కాస్త తడబడ్డాను. ఇదే మ్యాచ్ ఓటమికి కారణమైంది. నేను కూడా ధాటిగా బ్యాటింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. ఈ పిచ్ మీద మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. కానీ లక్ష్యాన్ని ఛేదించడంలో మేము విఫలమయ్యాము. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. మాకు ఇదొక గుణపాఠం. లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం” అని విచారం వ్యక్తం చేసాడు. ఇక ఈ మ్యాచులో 40 బంతులు ఎదుర్కున్న మార్కరం 41 పరుగులు మాత్రమే చేసాడు. మరి మార్కరం చేసిన కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి.