Aarohitha: ప్రముఖ శాండల్‌వుడ్ నటి ఆరోహిత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ రెడ్డి సమక్షంలో ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. పృథ్వీ రెడ్డి పార్టీ కండువా వేసి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వసంతనగర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుందని మనసులో మాట చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో మార్పు రావాలని అన్నారు. ఆ మార్పుతో పాఠశాలల్లో మంచి చదువు దొరకాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పాఠశాలల్లో కీలక మార్పులు తెచ్చిందని తెలిపారు.
అది కేవలం మంచి పరిపాలనతోనే సాధ్యం అవుతుందని చెప్పారు. అలాంటి మార్పు రావాలన్న ఉద్ధేశ్యంతోనే తాను ఆప్‌లో చేరానని స్పష్టం చేశారు. కాగా, ఆరోహిత పలు కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆటెగార, శిరిక్ పార్టీ, గౌడ్రు హోటల్, జగ్గి, అధ్యక్ష, ఆయుష్మాన్‌భవ సినిమాల్లో నటించారు. బెంగళూరులోని వసంత నగర ప్రాంతానికి చెందిన ఆరోహిత అసలు పేరు ప్రియాంక. ఆమె బీకాం వరకు చదువుకున్నారు. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి, నటి ఆరోహిత రాజకీయ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Conductor Jhansi: వైరల్ గా మారిన గాజువాక కండెక్టర్ ఝాన్సీ పాత వీడియో!