తెలుగు రాష్ట్రాల్లో గాజువాక కండక్టర్ ఝాన్సీ పేరు తెలియని వారు ఉండరు. కండక్టర్ వృత్తికే గౌరవం తెచ్చిన వారిలో మొదటి వరుసలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఉండగా.. ఆ తర్వాత మన గాజువాక కండక్టర్ ఝాన్సీ ఉన్నారు. ఒకవైపు కండక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తనకిష్టమైన డాన్స్ చేస్తూ వస్తున్నారు. పలు టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు దక్కలేదు. అయినప్పటికీ ఆమె తన ప్రయత్నాన్ని వదలలేదు. డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి 11 ఏళ్ళ పాటు శ్రమించారు. ఈమె హార్డ్ వర్క్ కి తగిన గుర్తింపు ఇన్నాళ్ళకి లభించింది. ఈమె డాన్స్ కి, హార్డ్ వర్క్ కి ఉన్న వర్త్ అటువంటిది మరి. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పల్సర్ బండి పాటకి డాన్స్ వేసి ఒక ఊపు ఊపారు. ఆ సాంగ్ తో ఒక్కసారిగా స్టార్ అయిపోయారు. అప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది.
ఎవరైనా పాపులర్ అయితే ఆ వ్యక్తికి సంబంధించిన పాత వీడియోలు పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డట్టు ఒక్కొక్కటీ బయటపడుతుంటాయి. తమ అభిమాన వ్యక్తి పాత వీడియోలు ఉంటే మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. అట్లుంటది అభిమానుల ఉత్సాహం. అలానే గాజువాక కండక్టర్ ఝాన్సీ విషయంలో కూడా అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. కండక్టర్ ఝాన్సీ గతంలో వేసిన ఒక డాన్స్ వీడియోని మళ్ళీ వైరల్ చేస్తున్నారు. సీతయ్య సినిమాలోని ఒక్కమగాడు మాస్ బీట్ సాంగ్ కి ఝాన్సీ మాస్ స్టెప్పులతో అరుపులు పెట్టించారు. ఈ సాంగ్ లో ఓ బీట్ దగ్గర ఇంద్ర సినిమాలో చిరు వీణ స్టెప్ వేయడం మెగా ఫ్యాన్స్ ని ఆకర్షిస్తోంది. ఆ డాన్స్ వీడియోని ఇప్పుడు ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సూపర్బ్ డాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి గాజువాక కండక్టర్ డాన్స్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.