‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశారా? భీమ్ పాత్ర చేసిన ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంది? ఫ్యాన్స్ అయితే కచ్చితంగా వావ్ అని పక్కా అంటారు. అంత బాగా తీశారు మరి. డైరెక్టర్ రాజమౌళి విజన్ ని ప్రతి ఒక్క ప్రేక్షకుడూ కచ్చితంగా మెచ్చుకుని తీరతాడు. ఇది మన తెలుగు సినిమా అని బల్లగుద్ది చెబుతాడు. అదేకాదు ఈ సినిమాలో అంతకంటే మంచి సీన్స్ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. మార్చిలో వరల్డ్ వైడ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైంది. మనదేశంతోపాటు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ చిత్రానికి ఫిదా అయిపోయారు.
ఇక తాజాగా ఆస్కార్ నామినేషన్స్ లోనూ చిత్రం సందడి చేస్తోందని సోషల్ మీడియా అంతా ఒకటే హడావుడి. ఇదే కాదు మూవీలో నిడివి సరిపోకపోవడం వల్ల తీసేసిన కొన్ని సీన్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. అలాంటి ఓ సీన్ ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన ఎన్టీఆర్.. ప్రారంభ సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్లాడు.
ఇక ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ లో.. నీటిపై రివర్స్ లో చూపిస్తూ కెమెరాని టర్న్ చేస్తారు. ఇకపోతే ఈ సీన్ ఎన్టీఆర్ కంటే ముందు ఓ తూనీగని చూపించి, ఆ తర్వాత ఎన్టీఆర్ ని చూపించాలి. కానీ నిడివి వల్లో ఏమో కానీ ఆ తూనీగ సీన్ ని తొలగించారు. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా చేసిన శ్రీనివాస్ మోహన్.. ఆ సీన్ ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు అదికాస్త వైరల్ గా మారింది. మరి ఈ ఇంట్రో సీన్ ఉండుంటే ఎలా ఉండేదని మీరు అభిప్రాయపడుతున్నారు. మీ ఓపినియన్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: RRRలో పులి సీన్ మేకింగ్ వీడియో వైరల్! జక్కన్న డెడికేషన్కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!