ట్రిపులార్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఒక సెన్సేషన్. ఇప్పటికీ విదేశాల్లో ఈ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. నెట్‌ఫ్లిక్స్ విడుదల తర్వాత ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. హాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, అభిమానులు మొత్తం రాజమౌళి దృశ్యకావ్యానికి నీరాజనాలు పడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా మేకింగ్ వీడియోలు, సీజీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం ట్రిపులార్ సినిమాలో ఎంతో ఫేమస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సీన్ మొత్తాన్ని రాజమౌళి దగ్గరుండి తీయడమే కాదు.. పులిగా తానే యాక్ట్ చేసి చూపించాడు. ఈ షాట్ ఎలా రావాలి? ఏ టైమింగ్‌తో చేయాలి అంటూ తానే రోప్స్ కట్టుకుని పులిలా చేసి చూపించాడు.
అంతేకాకుండా తన ఐడియాకి తగ్గట్లు ముందు ప్రతి షాట్‌కు డ్రాయింగ్ వేయించి చూసుకుని. ఆ తర్వాత ఫ్రేమ్ టూ ఫ్రేమ్ అనుకున్న విధంగా వచ్చిందా రాలేదా అనేది చూసుకుంటూ ఆ సీన్‌ను ప్రెజెంట్ చేశారు. అసలు ఆ ఒక్క సీన్ అనే కాదు.. రాజమౌళి చేసే ప్రతి సీన్ ప్రతి షాట్ అంతే పకడ్బందీగా ఉంటాయని ఎప్పటి నుంచో నడుస్తున్న టాకే. కాకపోతే ఇప్పుడు ఈ మేకింగ్ వీడియో చూశాక అందరికీ అర్థమవుతోంది.
ఈ సీన్లో పులి లేకపోయిన ఎంతో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్‌ని సైతం తెగ పొగిడేస్తున్నారు. అంతా రాజమౌళి సినిమా అనగానే ఆ హీరో నుంచి ఇంక మూడేళ్ల దాకా ఒక్క సినిమా కూడా రాదు అని కామెంట్ చేస్తుంటారు. కానీ, రాజమౌళి సినిమా అంటే ఒక్కోసారి ఒక షాట్ తీయడానికి రెండ్రోజులు నుంచి వారం రోజులు కూడా పడుతుంది. అంతేకాకుండా ఎక్కువ కాస్ట్, క్రూ ఉండటం వల్ల సినిమా సెట్ అంతా ఓ జాతరలా ఉంటుంది. అందుకే రాజమౌళి సినిమా అంటే అంత టైమ్ టేకింగ్ ఉంటుంది.
కానీ, ఒకసారి సినిమా రిలీజ్ అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా రీసౌండింగ్ వస్తుంది. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టినా.. ఇండియన్ సినిమా ప్రంపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసినా అది రాజమౌళికే సాధ్యమైందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ట్రిపులార్ సినిమా నుంచి వైరల్ అవుతున్న పులి ఛేజింగ్ సీన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.