”ఆస్వాదించే మనసుంటే.. నిశ్శబ్దం కూడా ఓ సంగీతమే!” సరైన సంగీతానికి.. సరైన వాయిద్యం తోడైతే.. ఆ పాట వినపడితే చాలు ఆటోమెటిక్ గా మన కాలు కదులుతుంది. అందుకే అంటారు సంగీతానికి భాషతో పనిలేదు.. దానికి హద్దుల్లేవ్! అని. మనసుకు నచ్చితే చాలు ఆ పాటకు డ్యాన్స్ చేస్తాం. ఇక్కడా అదే జరిగింది. ఓ ప్రముఖ భారత క్రికెటర్ భార్య ”రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో” పాటకు మాస్ స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ధనుశ్రీ వర్మ.. ప్రముఖ యూట్యూబర్, అదీకాక ఆమె భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు అయిన యజ్వేంద్ర చాహల్ భార్య. ధనుశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కొత్త పాటలకు తనదైన మాస్ స్టెప్పులతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు మరో సారి తన అందంతో, అభినయంతో, డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించింది.
తాజాగా హీరో నితిన్ నటించిన చిత్రం ”మాచర్ల నియోజకవర్గం.”ఈ మూవీలో ”రారా రెడ్డి ఐయామ్ రెడీ” అనే పాటలో ఉన్న ‘రాను రానుఅంటూనే చిన్నదో.. చిన్నదో ‘ అనే మాస్ బీట్ కు ధనుశ్రీ తనదైన స్టెప్పులతో ఊపు తెప్పించింది. ఓవైపు పాట పాడుతూనే ఉర మాస్ డ్యాన్స్ తో అదరగొట్టింది. తన స్టెప్పులతోనే కాకుండా ఈ భామ తన అందచందాలతో కూడా చూసే వారి మతి పోగొడుతోంది.
తన డ్యాన్స్ తో పాటు”మీరు మాట్లాడక పోయినా.. మీలో ఉన్న శక్తి ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతుంది.” అంటూ క్యాప్షన్ ట్యాగ్ చేసింది. ధను శ్రీ తనకు నచ్చిన పాటలకు ఇలా డ్యాన్స్ చేస్తూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ధనుశ్రీ కొరియోగ్రాఫర్, అలాగే ప్రముఖ యూట్యూబర్.. ఇవే కాకుండా ఆమె ఓ మంచి డెంటిస్ట్ కూడా. ఆమె ఓ దంత వైద్యశాలను కూడా నడుపుతోంది. ఆమె డ్యాన్స్ పై నెటిజన్స్ స్పందిస్తూ.. మీ డ్యాన్స్ కు మేమందరం ఫిదా అయ్యాం. మీరు ఇలాగే తెలుగు పాటలకు డ్యాన్స్ చెయ్యాలని కొరుకుంటున్నాం అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి తెలుగు పాటకు ఆమె వేసిన స్టెప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.