ఈ మధ్యకాలంలో సినిమాలు హిట్టా ఫట్టా అనేది టాక్ తో సంబంధం లేకుండా డిసైడ్ అయిపోతున్నాయి. ఓపెనింగ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్.. టాక్ బట్టి సినిమాలను అంచనా వేసేస్తున్నారు. కొన్ని సినిమాలు భారీ హైప్ మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తుంటాయి. ఇటీవల అటు హైప్ లేక, కలెక్షన్స్ లేక ప్లాప్ అయిన సినిమాలు చాలా వచ్చాయి. హీరోల సినిమాల పరిస్థితే ఇలా ఉంటే.. ఇంకా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పరిస్థితి ఏంటని అంతా అనుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘యశోద’ సినిమాకు రిలీజ్ ముందు మోస్తరు హైప్.. క్రియేట్ అయ్యింది. కానీ.. సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన యశోద సినిమా.. మొదటి రోజు బాక్సాఫీస్ ని షేక్ చేసింది. హరీష్ నారాయణ్ – హరిశంకర్ దర్శకద్వయం రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీని.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో విడుదలైంది. ఇక మొదటి షో నుండే హైలీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న యశోద సినిమా.. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ యశోద రూ. 6.32 కోట్లు గ్రాస్ రాబట్టగా.. రూ. 3.5 కోట్లకు పైగా షేర్ వసూల్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. స్టార్ హీరోల సినిమాలు రాబట్టలేని నెంబర్స్ యశోద రాబట్టిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాకు యూనిక్ స్టోరీతో పాటు సమంత క్రేజ్ కూడా తోడవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయానికి వర్కౌట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక యశోద మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. మొత్తంగా రూ. 18.5 కోట్లు జరిగిందని సమాచారం. ఈ లెక్కన యశోద మూవీ ఇంకా రూ. 15 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. చూడాలి మరి ఈ వీకెండ్ యశోదకి కలిసి వస్తుందేమో!
With huge Positive Talk & Phenomenal Response, #Yashoda bags 6.32CR Gross WORLDWIDE on DAY 1🔥
Book Tickets Now 🎟️https://t.co/rapPt5X6ne#YashodaInTheatres @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/jf1EtngEOc
— Ramesh Bala (@rameshlaus) November 12, 2022