గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, స్మాల్ స్క్రీన్, వెండి తెరపై విశ్వక్ సేన్ పేరు తెగ మారుమోగిపోతుంది. తన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో.. ఆ తరువాత బూతులు వాడటంతో చోటు చేసుకున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వివాదం మాత్రం విశ్వక్ సేన్‌కి కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. వివాదం విషయంలో విశ్వక్‌కు నెటిజనుల నుంచి భారీ ఎత్తున మద్దతు రావడంతో సినిమాపై కూడా పాజిటీవ్ బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్టే ఈ సినిమాలో విశ్వక్ తన మాస్ లుక్‌కి భిన్నంగా క్లాస్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమా హిట్‌ని ఎంజాయ్ చేస్తున్న విశ్వక్ సేన్.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో వైరలవుతోంది. దీనిలో విశ్వక్ సేన్ దయచేసి.. ఆ వీడియోలు డిలీట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇంతకు దేని గురించి విశ్వక్ రిక్వెస్ట్ చేశాడో తెలియాలంటే.. ఇది చదవండి.
ఇది కూడా చదవండి: Vishwak Sen: దేవీ నాగవల్లికి విశ్వక్ సేన్ థ్యాంక్స్ చెప్పాలంటూ కొత్త డిమాండ్..!
ప్రసుత్తం థియేటర్‌లో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని చిత్రాలైతే.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన అవశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా కూడా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఓటీటీ రిలీజ్ తేదీ ఎప్పుడు.. ఎందులో ఇలా అన్ని వివరాలతో అప్ డేట్స్ ఇస్తున్నారు. విశ్వక్ సేన్ సినిమాకు అదిరిపోయే రీ-డీల్ అని.. త్వరలోనే ఓటీటీలో అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ కాబోతుందని.. ఇలా పలు కథనాలు వచ్చాయి. ఓ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా త్వరలోనే ప్రసారం కానుందంటూ తేదీతో సహా.. నెట్టింట పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై విశ్వక్ సేన్ స్పందించాడు. ఓ వీడియో రిలీజ్ చేశాడు.
ఇది కూడా చదవండి: Vishwak Sen: సినిమా హిట్ తో రెచ్చిపోయిన విశ్వక్ సేన్! మాస్ స్టెప్పులతో రచ్చ!దానిలో అతడు మాట్లాడుతూ.. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. సినిమా సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకుపోతుందని.. ఇలాంటి వేళ.. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకులు ఉత్సాహాన్ని నీరుగార్చేలా.. ఓటీటీ విడుదల తేదీ గురించి పోస్ట్‌లు, వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదని తెలిపాడే. ఓటీటీ విడుదల తేదీ గురించి తనకే తెలియదని.. దాని గురించి అధికారిక ప్రకటన వస్తే.. వెల్లడిస్తానని తెలిపాడు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే థియేటర్‌లో సినిమా చూడాలనుకునేవారు కూడా ఓటీటీ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు సినిమాహాళ్లకు రారు. కాబట్టి దయచేసి ఓటీటీ రిలీజ్ డేట్ గురించి పెట్టిన పోస్ట్‌లని డిలీట్ చేయండి.. రూమర్స్ వ్యాప్తి చేయకండి అని కోరాడు. విశ్వక్ సేన్ విజ్ఞప్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Jayamma Panchayathi: సుమ కొంపముంచిన విశ్వక్- దేవి వివాదం!