విజయ్ దేవరకొండ.. రౌడీ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సెల్ఫ్ మేడ్ హీరోగా బాగా పాపులర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారాడు. ఇప్పుడు లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ ఎప్పుడూ తనదైనశైలిలో స్పందించడం, తనని తాను ప్రమోట్ చేసుకోవడం చేస్తుంటాడు.
అయితే విజయ్ దేవరకొండ విషయంలో ఇటీవల ఇండస్ట్రీలో నెపోటిజంపై కామెంట్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. నా అయ్య తెల్వదు, తాత ఎవడో తెల్వదు అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టినవారు ఉన్నారు. బండ్ల గణేశ్ అయితే పేరు వాడకుండా ట్విట్టర్ లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నెపోటిజంపై అసలు ఈ రౌడీ హీరో మనసులో ఏముందే బయట పెట్టాడు. అనన్యా పాండేతో కలిసి కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన విజయ్ నెపోటిజంపై ఓపెన్ కామెంట్స్ చేశాడు.
Few Latest ❤️🔥@TheDeverakonda @ananyapandayy@karanjohar#KoffeeWithKaranS7
Pics – @VDTrendsOffl
pic.twitter.com/7B1bMM52vS— Anonymous (@__GirDhar) July 27, 2022
ఇండస్ట్రీతో సంబంధం లేని సినిమాల్లోకి రావడం కష్టమా? అని అడిగిన ప్రశ్నకు.. “ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తి లోపలికి రావడం అంత తేలిక కాదు. అది ఎంతో కష్టంతో కూడుకున్న విషయం. ఎవరూ తెలియని పరిస్థితుల్లో వెలివేసినట్లు ఉంటుందని చెప్పలేం. ఎవరూ ఒకేలాంటి ఆర్థిక స్థోమత, అంతస్థులతో పుట్టరు. అందరికీ ఒకేలాంటి ఎత్తు, కలర్, అందం ఉండదు. అసలు ఈ ప్రపంపచమే న్యాయంగా లేదు అనిపిస్తోంది.” అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే నెపోటిజయంపై కూడా వ్యాఖ్యలు చేశాడు. “నేను ఎప్పుడూ బాగా డబ్బున్న వాళ్ల పిల్లలు, స్టార్ హీరోల పిల్లలను చూసి అసూయపడలేదు, వాళ్లను నేను బ్లేమ్ చేయను. స్టార్ కిడ్ గా పుట్టడం వాళ్ల తప్పు కాదు. రేపు నాకు పిల్లలు పుడతారు. ఒక నటుడి కొడుకుగా పుట్టడం వాడి తప్పు కాదు. ప్రపంచం ఎవరితోనూ న్యాయంగా లేదు.. ఎక్కడా సమానత్వం లేదు. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే నీ కష్టం నువ్వు పడాల్సిందే” అంటూ రౌడీ హీరో ఓపెన్ అయ్యాడు. విజయ్ దేవరకొండ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I’m grateful for every insult, hardship, every obstacle I’ve faced in my life. I don’t expect world to be fair to me. #VijayDeverakonda #Liger #AnanyaPanday #VijayDevarakonda pic.twitter.com/EbIkN7eLPe
— 🅵🅸🆁🅴🔥🌊⚕️🩺 (@TheDrSammy) July 29, 2022