సినిమాలు, సీరియల్స్ అనేవి నటుల్ని మన ఇంట్లో ఒకరిగా మారుస్తాయి. నటులు తమ నటనతో నవ్విస్తారు, ఏడిపిస్తారు, తెలియని ఒక మాయ చేస్తారు. వారి నటనకి అందరూ కనెక్ట్ అయిపోతారు. అందుకే వారికి ఏమైనా అయితే తట్టుకోలేరు. వారికేమైనా అయితే ఇంట్లో కుటుంబ సభ్యులకి అయినంతగా భావిస్తారు. కళాకారులు భౌతికంగా మరణించినా, ఈ సినిమా చరిత్ర ఉన్నంత వరకూ వాళ్ళు కళాకారులుగా బతికే ఉంటారు. సినిమా యొక్క గొప్పతనం అదే. భౌతికంగా మనిషి దూరమైనా అతను చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకులు, అభిమానుల మనస్సుల్లో మాత్రం జీవించేలా చేస్తుంది. అయితే ఎంత చిరంజీవులు అయినా గానీ భౌతికంగా మనిషి దూరమైనప్పుడు బాధ అనేది మామూలే. ఇండస్ట్రీలో ప్రముఖ నటులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు.
తాజాగా ప్రముఖ నటుడు కన్ను మూయడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కన్ను మూశారు. 3 ఇడియట్స్, కేదార్నాథ్, పానిపట్, లాల్ సింగ్ చడ్డా వంటి సినిమాల్లో నటించిన నటుడు అరుణ్ బాలి (79) శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. 1989లో అరుణ్ బాలి దూస్రా కేవల్ అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టారు. ది గ్రేట్ మారత, మహాభారత కథ, ఐ లవ్ మై ఇండియా ఇలా దాదాపు 30 సీరియల్స్ లో నటించారు. 1991లో దూరదర్శన్ లో ప్రసారమైన పీరియడ్ డ్రామా సీరియల్ చాణక్యలో పురుషోత్తముడు (కింగ్ పోరస్) పాత్రలో నటించి మెప్పించారు. సీరియల్స్ లోనే కాకుండా సినిమాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు.
2000వ సంవత్సరంలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకున్న హే రామ్ అనే సినిమాలో నటించారు. 20వ శతాబ్దంలో తాత పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా అరుణ్ బాలి నిలిచారు. బాలీవుడ్ లో సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ తాత పాత్ర ఉందంటే మేకర్స్ మైండ్ లో మెదిలే పేరు అరుణ్ బాలిదే. అంతలా ఆయన ప్రాముఖ్యత సంపాదించుకున్నారు. కుంకుం ప్యారా సా బంధన్ అనే సీరియల్ లోని హర్షవర్ధన్ వధ్వ అనే పాత్రలో ఆయన ఒదిగిన తీరుకి ఎన్నో అవార్డులు వరించాయి. సంజయ్ దత్ నటించిన లగే రహో మున్నాభాయ్, ఆమిర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్, పీకే, సల్మాన్ ఖాన్ నటించిన రెడీ, అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్, సామ్రాట్ పృథ్వీ రాజ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.
ఆఖరి సారిగా ఆయన నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. పంజాబీ ముహియల్ బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన అరుణ్ బాలి శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకి ముంబైలో తుది శ్వాస విడిచారు. మ్యస్థెనియా గ్రేవీస్ అనే దీర్ఘకాలిక నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మరణంతో బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ బాలి కుటుంబ సభ్యులకు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Actor Arun Bali expired today morning at 4.30 am in Mumbai.
May God bless the departed soul.🙏🙏 💔 pic.twitter.com/UQ4eRIdNxx— Urban Asian (@UrbanAsian) October 7, 2022