గరికపాటి నరసింహారావు.. రెండు తెలుగురాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరేమో. సరస్వతీ పుత్రుడిగా, ఒక గొప్ప అవధానిగా ఈయనకు చాలా మంచి పేరుంది. ఆయనకు, ఆయన చెప్పే ప్రవచనాలకు అభిమానులు కూడా ఉన్నారు. ఆయన చెప్పే మాటల్లో సహనం, శాంతం, ఔన్నత్యం, బుద్ధి, ఆలోచన అనే మాటలు బాగా వినిపిస్తూ ఉంటాయి. కానీ, ఈరోజు(అక్టోబర్ 6) ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రవర్తించిన తీరులో అవి ఏ కోశానా కనిపించలేదు. అసలు రోజూ మనం చూసేది ఈ గరికపాటినేనా? ఆయన చెప్పే మాటలేనా మనం రోజూ వినేది అనే అనుమానం రాకమానదు. ఎందుకంటే గరికపాటి నరసింహారావు ప్రవర్తించిన తీరు అటు మెగా అభిమానులనే కాదు.. యావత్ తెలుగు సినిమా పరిశ్రమని సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ప్రవర్తించిన తీరు చూసి మెగా అభిమానులు గరికపాటిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది.
అసలు ఏం జరిగిందంటే.. 17 ఏళ్లుగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో దసరా తర్వాతి రోజు అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమంలో అందరూ కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకుని, ప్రేమగా ఒకరిని ఒకరు కౌగిలించుకుని, ఆనందంగా విందు ఆరగించి వెళ్తారు. ఈ ఏడాది ఆ కార్యక్రమాన్ని దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఆయనకు ఆహ్వానం ఇస్తున్న సందర్భంలోనే దత్తాత్రేయ ప్రత్యేకంగా రేపు మీరు కార్యక్రమంలో మా కుటుంబసభ్యులకు ఫొటోలు కూడా ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేశారు. అందుకు మెగాస్టార్ ఎంతో వినయంగా సరేనని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన తర్వాత.. ముందుగా చెప్పిన విధంగా దత్తాత్రేయ కుటుంబసభ్యులతో చిరంజీవి ఫొటోలు దిగేందుకు వచ్చారు. సభకు ఇబ్బంది లేకుండా ఒక పక్కన ఏర్పాటు చేయమని చిరంజీవి చెప్పగా.. అలాగే ఏర్పాటు చేశారు. చిరంజీవి స్టేజ్ పై ఓ పక్కన దత్తాత్రేయ కుటుంబసభ్యులతో ఫొటోలు దిగుతూ ఉన్నారు.
ఆ సమయంలో ప్రసంగం ప్రారంభించిన గరికపాటి నరసింహారావు అసహానికి లోనయ్యారు. చిరంజీవి ఆ ఫొటో సెషన్స్ ఆపి ఇక్కడకు వచ్చి కూర్చుంటేనే నేను ప్రసంగిస్తాను, లేదంటే సెలవు ఇప్పించండి వెళ్లిపోతాను అని చెప్పారు. అలా అనడమే కాదు.. లేచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు కూడా. ఆ సమయంలో సీపీఐ నారాయణ, అక్కడున్న కొందరు ఆపి మళ్లీ కూర్చోబెట్టారు. కాసేపటికి చిరంజీవి అక్కడికి వచ్చి గరికపాటి పక్కన కూర్చొని ఆయన చెప్పింది విని వెళ్లారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనే విషయమే తెలియకుండా చిరంజీవి ఫొటోలు ఇస్తూ ఉన్నారు. అక్కడ అంత మంది ఉన్నా, మీదపడి తోస్తున్నా చిరు నవ్వు చెరగకుండా ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చారు. గరికపాటి చేసిన వ్యాఖ్యలు అసలు ఆయన పట్టించుకోలేదు కూడా. నిజానికి గరికపాటి చేసిన వ్యాఖ్యలు చిరంజీవి వినుంటే తప్పకుండా వచ్చి ముందు ఆయన పక్కన కూర్చొనేవారు.
మెగాస్టార్ చిరంజీవి తీరా ఇంటికి వెళ్లి చూసేసరికి టీవీల్లో, యూట్యూబ్ ఛానల్స్ లో చిరంజీవిపై గరికపాటి ఆగ్రహం, చిరుపై చిర్రుబుర్రులాడిని గరికపాటి అంటూ వార్తలు కనిపించాయి. ఇంటికి వెళ్లే వరకు అసలు అలయ్ బలయ్ లో ఏం జరిగిందని చిరంజీవికి తెలియదు. గరికపాటి వ్యవహరించిన తీరుపై సీనియర్ జర్నలిస్ట్ ప్రభు స్పందించారు. “అలయ్ బలయ్‌కి వచ్చిన మిమ్మల్ని మెగాస్టార్ చిరంజీవి తల వంచి మీకు నమస్కారం చేసి.. ఎంతో సాదరంగా ఆహ్వానించారు. మరి.. మీరు స్కూల్లో పిల్లాడిని, ఏదో జూనియర్ ఆర్టిస్ట్ ని గదమాయించినట్లు మాట్లాడుతున్నారు. మీ మీద ఉన్న గౌరవానికి.. ఈరోజు మీరు ప్రవర్తించిన తీరుకు అస్సలు పొంతన లేదు. మెగాస్టార్ లాంటి ఔన్నత్యం కలిగిన వ్యక్తిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీకున్న జ్ఞానం, పాండిత్యం ఏమయ్యాయి? అలాగానే మీరు ప్రవర్తించేది? కోపిష్టికి మించిన పాపిష్టి లేడు” అంటూ జర్నలిస్ట్ ప్రభు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ల మీద ఎవరైనా ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
గరికపాటి నరసింహారావు తీరుపై మెగా బ్రదర్ నాగబాబు సైతం కౌంటర్ ఇచ్చారు. “ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే” అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అటు మెగా అభిమానులు సైతం గరికపాటి తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు సరస్వతీ పుత్రులు కావచ్చు. కళారంగంలో ఆయన కూడా సరస్వతీ కటాక్షం కలిగిన వ్యక్తే అంటూ కామెంట్ చేస్తున్నారు. మీరు మొన్నీ మధ్య పద్మశ్రీ తీసుకున్నారేమో.. అక్కడ పద్మభూషణుడు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. అసలు గరికపాటి కాదు నోటిదూలపాటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. గౌరవం కూడా తెలియని గరికపాటి, నోటిదూలపాటి, అసలు నువ్వు ఒక పెద్దమనిషివేనా? అంటూ మెగా అభిమానులు, సినిమా ఇండస్ట్రీ వారు ప్రశ్నించడమే కాదు.. ఆయన తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. మరి.. ఆయన ప్రవర్తన, దానిపై వస్తున్న వ్యతిరేకత, మెగా అభిమానుల ఆగ్రహం వీటన్నింటిపై గరికపాటి నరసింహారావు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. చిరంజీవితో గరికిపాటి ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.