ఇండియన్ మోస్ట్ ఎలిజిబుల్ పాన్ ఇండియా స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి, సాహో సినిమాలతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుసగా బిగ్ ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. హీరోగా ప్రభాస్ కెరీర్ గురించి పక్కన పెడితే.. ప్రభాస్ పెళ్లి వార్త వినాలని ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అదీగాక ప్రభాస్ అంటే సినీ ఇండస్ట్రీలో ఇష్టపడని వారుండరు. అంత మంచి మనసున్న ప్రభాస్.. కొన్నేళ్లుగా పెళ్లి వార్తలను దాటవేస్తూ వస్తున్నాడు. గతంలో హీరోయిన్ అనుష్కతో కూడా ప్రభాస్ పెళ్ళని, వారిద్దరూ లవ్ లో ఉన్నారని ఎన్నో కథనాలు వచ్చాయి.
ఆ నోటా ఈ నోటా వెళ్లి.. ఆఖరికి ప్రభాస్, అనుష్కల చెవిన పడేసరికి.. అదంతా ట్రాష్ అని, తాము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ అని తేల్చి చెప్పేశారు. అప్పటినుండి ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తిచేసి, సలార్.. ప్రాజెక్ట్ K సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. కాగా, రామాయణం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్ కృతిసనన్ నటిస్తోంది. ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీరాముడిగా నటించగా.. కృతి సీత పాత్రలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.
కొద్దిరోజులుగా కృతి సనన్ – ప్రభాస్ లవ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఆదిపురుష్ ఈవెంట్స్ లో క్లోజ్ గా కనిపించడంతో పుకార్లు మొదలయ్యాయి. కానీ.. ఇటీవల ‘భేడియా’ మూవీ ప్రమోషన్స్ లో కృతినే ప్రభాస్ ఒప్పుకుంటే పెళ్లాడతానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ విషయం ఊరికే అనుకున్నా.. తాజాగా భేడియా ప్రమోషన్స్ లో హీరో వరుణ్ ధావన్ కృతి లవ్ పై క్లారిటీ ఇచ్చేశాడు. భేడియా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ మాట్లాడుతూ.. “కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. పప్రస్తుతం అతను ముంబైలో లేడు. ఇప్పుడతను దీపికా పదుకోనెతో షూటింగ్ లో ఉన్నాడు” అని హిట్ ఇచ్చాడు. దీంతో వరుణ్ మాటలు విని కృతిసనన్ సిగ్గుపడింది.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కృతి సనన్ ప్రభాస్ ని లవ్ చేస్తున్న విషయం నిజమేనని గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అదీగాక.. ప్రభాస్ ఇప్పుడు ముంబైలో లేడు, పైగా దీపికాతో ప్రాజెక్ట్ K షూటింగ్ లో ఉన్నాడు.. సో.. డార్లింగ్ ప్రభాస్ కి తోడు దొరికేసిందని, కృతి ఈ విషయాన్నీ చెప్పకనే సిగ్గుపడుతూ చెప్పేసిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదిపురుష్ మూవీ ఒప్పుకున్నప్పటి నుండి ప్రభాస్ కి హిందీ నేర్పిస్తుంది కృతినేనట. అలాగే తనకు ప్రభాస్ తెలుగులో హెల్ప్ లో హెల్ప్ చేస్తుంటాడని ఇదివరకే చెప్పింది. మరి ఇదే నిజమైతే.. ప్రభాస్ – కృతిలు త్వరలో పప్పన్నం పెట్టించడం ఖాయమని సినీవర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి త్వరలో ఈ విషయంపై ఏదైనా క్లారిటీ రానుందేమో!
Whaaaaaaattt 😯😁🥰💖…… Joo meyy soch raha hoo, voo aap log bii?!😌😹🤔🤔. #KritiSanon #Prabhas𓃵 !! #ProjectK 🪐 pic.twitter.com/F3s91EyFwe
— Jai Kiran💕Adipurush🏹 (@Kiran2Jai) November 27, 2022
This Pair 😚😍#Prabhas 💞 #KritiSanon pic.twitter.com/D6cfePubTZ
— 𝐒𝐔𝐌𝐀𝐍𝐓𝐇 𝐕𝐀𝐑𝐌𝐀 (@__SUMANTHVARMA) November 25, 2022
#Prabhas #KritiSanon offline chemistry kuda baguntadhi 😍🙌👌❤
Waiting for #Adipurush 🏹❤ pic.twitter.com/oUgwiWxgtZ— Prabhas ❤ (@ivdsai) November 25, 2022