కతర్ పాప.. తొలుత టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యింది. తర్వాత యూట్యూబ్ లో వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఇప్పుడు తనను ప్రేమ పేరుతో వాడుకుని గర్భవతిని చేశాడు అంటూ తన లవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది
టిక్ టాక్.. ఈ సోషల్ మీడియా యాప్ కొందరి జీవితాలనే మర్చేసింది. ఇక మరికొందరిని ఓవర్ నైట్ స్టార్ లను చేసిందంటే అతిశయోక్తి కాదు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన వారిలో కతర్ పాప అలియాస్ షాలిని కూడా ఒకరు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది షాలిని. ఇక అది బ్యాన్ అయిన తర్వాత యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది. అయితే తన లవర్ తనను ప్రెగ్నెంట్ చేసి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కతర్ పాప.. తొలుత టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యింది. తర్వాత యూట్యూబ్ లో వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కొన్ని బోల్డ్ ఇంటర్వ్యూలు ఇచ్చి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఇప్పుడు తనను ప్రేమ పేరుతో వాడుకుని గర్భవతిని చేశాడు అంటూ తన లవర్ రోహిత్ పటాన్ ఖాన్ పై ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కతర్ పాప అలియాస్ షాలిని. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన షాలినికి రోహిత్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. అయితే కొన్ని రోజుల తర్వాత రోహిత్ ప్రేమిస్తున్నాను అంటూ కతర్ పాప వెంట పడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పాడు.
దాంతో అతడి మాటలు నమ్మిన కతర్ పాప అతడితో కలిసి సహజీవనం చేస్తోంది. గత ఆరు నెలలుగా హైదరాబాద్ లోని బోరబండలో ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే కతర్ పాప గర్భం దాల్చింది. దాంతో కతర్ పాప తనను పెళ్లి చేసుకోవాంటూ రోహిత్ ను అడిగింది. రోహిత్ కొన్ని రోజులుగా సమాధానం చెప్పకుండా తిరుగుతున్నాడు. గట్టిగా నిలదీస్తే.. పెళ్లి చేసుకోను అని చెప్పాడు. దాంతో కతర్ పాప చేసేది ఏమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు అంటూ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రోహిత్ పఠాన్ ఖాన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం కతర్ పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు పోలీసులు.