తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్ధస్త్ వంటి కామెడీ షోకు పోటీగా ఈ షో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ పొందింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ షో మరోకొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సారి.. ‘మదర్స్-డాటర్స్’ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో సుధీర్ కనిపించి అందరిని షాక్ గురిచేశాడు. అయితే ఈ ప్రోమోలో కాంతార సినిమాలోని క్లైమాక్స్ సీన్ ను రీ క్రియేట్ చేశారు. అందులో కాంతార పాత్రలో నూకరాజు అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘కాంతార’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. కన్నడలో విడుదలైన ఈ సినిమా .. అనంతరం తెలుగు, తమిళ తో పాటు పలు భాషల్లో విడుదల చేశారు. అక్కడ కూడా భారీ వసూలు రాబట్టింది. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేకక్షులను మైమరిపించేలా చేసింది. ఇక ఈసినిమాలోని ఆ సన్నివేశాన్ని పలు షోల్లో రీ క్రియేట్ చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ‘కాంతార’ క్లైమాక్స్ ను రీ క్రియేట్ చేశారు. ఇందులో ‘కాంతార’ గా నూకరాజు చేసిన నటన ప్రోమోకు హైలెట్ గా నిలిచింది. కాంతార సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా నూకరాజు ఈ సన్నివేశంలో నటించాడు.
అలా ఈ ప్రోమో మొదటి నుంచి చివరకి వరకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అలానే ఈ ప్రోమోలో సుధీర్, రాంప్రసాద్ సందడి వేరే లెవేల్ లో ఉంది. ఈక్రమంలో కొందరు సుధీర్ పై సెటైర్లు కూడా వేశారు. మదర్స్-డాటర్స్ అనే కాన్సెప్ట్ తో అమ్మలకు, కూతుర్లకు పోటీలు జరిగాయి. బుల్లితెర బ్యూటీలు భాను, వర్షలు తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇక భాను శ్రీ తన పాటతో అందరిని కన్నీరు పెట్టించింది. అందాల భామ రష్మీ సైతం భాను పాటకు ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.