బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుధీర్, రష్మీల స్థాయిలో లేకపోయినా.. వారి తర్వాత మినిమమ్ క్రేజ్ ని సంపాదించుకున్న జంటలలో జబర్దస్త్ ఇమ్మానుయేల్, వర్ష తప్పకుండా ఉంటారు. యాంకర్ రష్మీ వలన సుధీర్ ఎలా ఫేమ్ అయ్యాడో.. జబర్దస్త్ లోకి వర్ష వచ్చాకే ఇమ్మానుయేల్ క్రేజ్ అలా అమాంతం పెరిగిందని చెప్పాలి. జబర్దస్త్ లో వర్ష ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే ఇమ్మానుయేల్ ఫేమ్ లోకి వచ్చాడు. అలాగే వీరి స్కిట్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ప్రెజెంట్ ఇమ్మానుయేల్, వర్ష ఇద్దరూ బుల్లెట్ భాస్కర్ టీమ్ లో స్కిట్స్ చేస్తున్నారు.
ఇక బుల్లితెరపై లవర్స్ గా చలామణి అవుతున్న ఇమ్మానుయేల్, వర్ష.. స్కిట్స్ లో కూడా ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. కానీ.. అదంతా ట్రాష్, పబ్లిసిటీ స్టంట్ అని తెలిసినా జనాలు వీరి జంటను ఆదరించేందుకు రెడీగానే ఉన్నారు. నిజంగా లవ్ ఉండి.. ఎందుకు ప్రపోజ్ చేసుకోవట్లేదు.. అనుకునేవారికి రీసెంట్ గా తన లైఫ్ లో వేరే లవ్ స్టోరీ ఉందని చెప్పి, ఇమ్మానుయేల్ కి షాకిచ్చింది వర్ష. ఇదంతా రియల్ గా కాదు.. స్కిట్ లో భాగంగా చేశారు. ఇటీవల బాక్సాఫీస్ ని షేక్ చేసిన ‘లవ్ టుడే’ మూవీ కాన్సెప్ట్ తో స్కిట్ చేశారు వర్ష, ఇమ్ము. ఇందులో అమ్మాయి తండ్రి ఇద్దరి ఫోన్స్ ఒకరోజు మార్చుకోమని చెబుతాడు. ఆ తర్వాత రోజు ఇద్దరికీ ఓకే అయితే పెళ్లి చేస్తానని అంటాడు.
ఇప్పుడు దీన్నే స్కిట్ గా మార్చి.. స్టేజ్ పై ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. ఈ స్కిట్ లో భాగంగా వర్ష ఫోన్ లో సీక్రెట్స్ ఇమ్ముకి, ఇమ్ము ఫోన్ లో సీక్రెట్స్ వర్షకి తెలిసి ఇద్దరు షాక్ అవుతారు. ఈ క్రమంలో వర్షకి ఎక్కడ చాట్ చేయాలో తెలియక సీక్రెట్ గా ఫోన్ పేలో చాట్ చేస్తుందంటూ కామెంట్ చేస్తాడు ఇమ్ము. ప్రస్తుతం వీరి ఎక్సట్రా జబర్దస్త్ స్కిట్ సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. లేటెస్ట్ గా విడుదలైన ఈ ప్రోమో నెటిజన్స్ తో పాటు బుల్లితెర ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా.. వర్ష, ఇమ్మానుయేల్ పెయిర్ కి కొత్త స్కిట్ తో మరింత క్రేజ్ పెరుగుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరి వర్ష, ఇమ్మానుయేల్ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.