‘జబర్దస్త్’ అనగానే కామెడీ షోనే గుర్తొస్తుంది. ఇందులో అంతకు మించిన కెమిస్ట్రీ పండించిన జోడీలు కూడా ఉంటాయి. వాళ్లలో సుడిగాలి సుధీర్-రష్మీ జంటనే బాగా పాపులర్ అయింది. వీళ్లు దాదాపు కొన్నేళ్లపాటు బుల్లితెరని ఏలారు. అభిమానులకు అంతులేని వినోదాన్ని అందించారు. ప్రతి వారం ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’తో పాటు ఢీ షో, స్పెషల్ ఈవెంట్స్ లోనూ వీళ్ల డామినేషనే ఉండేది. వీళ్ల తర్వాత వీళ్ల అంతలా కాకపోయినప్పటికీ.. కొద్దోగొప్పో పేరు తెచ్చుకున్న వాళ్లలో ఇమ్ము-వర్ష జోడీ ఒకటి. సుధీర్.. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇమ్ము-వర్ష మధ్య కెమిస్ట్రీ బేస్ చేసుకునే ఎపిసోడ్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటిదే చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇమ్మాన్యుయేల్-వర్ష జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లవ్ స్టోరీని బయటపెట్టి.. రియల్ లైఫ్ లోనూ లవర్స్ అనే రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటనేది పక్కనబెడితే.. ఈ జంటపై చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ కూడా చాలావరకు అలానే ఉండిపోయాయి. అలాంటి వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. కాకపోతే అది రియల్ లైఫ్ లో కాదు.. జబర్దస్త్ స్టేజీపై. గతంలో ఇమ్ముతే స్కిట్లలో కెమిస్ట్రీ వర్కౌట్ చేసి రక్తి కట్టించిన వర్ష.. ఇప్పుడు కూడా అలానే చేసింది. కాకపోతే పెళ్లి జరగాలంటే కొన్ని కండీషన్స్ తప్పనిసరి అని చెబుతూ షాకిచ్చింది.
మన పెళ్లి జరగాలంటే చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ కావాలని వర్ష చెప్పింది. ఒప్పుకొందనే ఆనందంతో ఉబ్బితబ్బిబయిన ఇమ్ము.. తనకు చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్ తెలుసని బిల్డప్ కొట్టాడు. దీంతో వాళ్లని, తమ పెళ్లికి తీసుకురమ్మని వర్ష అడగ్గా.. సదరు హీరోలని స్టేజీపైకి తీసుకొచ్చాడు. సదరు డూపులు డ్యాన్సులతో రప్ఫాడించారు. అలానే పల్సర్ బైక్ సాంగ్ కి ముగ్గురు డూప్ లతో కలిసి వర్ష స్టెప్పులేసింది. ఇలా ఫన్నీగా ఉన్న ఈ ప్రోమో.. ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది. అలానే ఈ స్కిట్ లో విక్రమ్ సినిమా స్ఫూప్ ని కూడా రాంప్రసాద్-గెటప్ శ్రీను చేశారు. ఇది కూడా ఫుల్ ఆన్ ఫన్నీగా ఉండేలా చూసుకున్నారు. మరి ఇమ్ము-వర్ష కెమిస్ట్రీ మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.