బుల్లితెర ప్రేక్షకుల్లో సుధీర్- రష్మీ జంటకు ఎంత క్రేజ్ ఉందో.. వర్ష- ఇమ్మాన్యుయేల్ జంటకు కూడా అంతే క్రేజ్ ఉంది. వాళ్ల స్కిట్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పచ్చు. వారి జంటపై స్కిట్లలోనే చాలా సెటైర్లు వేస్తారు. అది ప్రేక్షకుల కోసం క్రియేట్ చేసిన పెయిర్ అయినా తెలిసినా కూడా మంచి స్పందన వస్తుంటుంది. తాజాగా ప్రోమోలో వర్ష- ఇమ్మాన్యుయేల్ మధ్య జరిగిన ఓ ఫన్నీ సన్నివేశం వైరల్ గా మారింది.
స్కిట్ లో భాగంగా తోటి సభ్యులను ఒక్కోసారి ఇన్వాల్వ్ అయ్యి కొట్టేస్తుంటారు. అలానే ఇమ్మాన్యుయేల్ కూడా వర్షను కొట్టేశాడు. ఏం జరుగుతోంది ఇక్కడ పడుకున్న వాళ్లని డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ వర్ష డైలాగ్ చెప్పగానే.. ఇమ్మూ ఆమె జుట్టు పట్టుకుని ఒక్క ఉదుటున లాగేస్తాడు. దెబ్బకి బిత్తరపోయిన వర్షను బుల్లెట్ భాస్కర్ వచ్చి లేపుతాడు. ఒక్కోసారి స్కిట్లో భాగంగా అలాంటి జరుగుతుంటాయిలే అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.