ఒకప్పుడు ఎంటర్ టైన్ మెంట్ అంటే కేవలం సినిమాలు మాత్రమే. కానీ గత కొన్నేళ్లలో టీవీ షోలు ఆదరణ బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్లే ప్రతి ఛానెల్ వాళ్లు.. డ్యాన్స్, సింగింగ్, కామెడీ షోలతో ఆడియెన్స్ ని అలరిస్తూ వచ్చారు. అయితే ఇందులో ఈటీవీ మాత్రమే గట్టిగా నిలబడింది. ఢీ డ్యాన్స్, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో ఆకట్టుకుంటూనే ఉంది. అలా అప్పుడప్పుడు ఇందులో కాంట్రవర్సీలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఓ సంఘటన జరగ్గా, సెట్ లో ఉన్నవారందరూ అవాక్కయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈటీవీలోని ప్రతి షోలోనూ హైపర్ ఆది కనిపిస్తుంటాడు. తన పంచులతో అలరిస్తుంటాడు. ఇక ఢీషోలోనూ వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ గా చేస్తున్నాడు. జడ్జి శ్రద్ధాదాస్ ని ఎప్పుడూ టీజ్ చేస్తుంటాడు. అంతే కాకుండా హగ్ ఇవ్వాలి కిస్ కావాలి అని అడుగుతుంటాడు. ఇకపోతే తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా.. ఏకంగా శ్రద్ధాదాస్, హైపర్ ఆది చెంప చెళ్లుమనిపించింది. ఓ ఫన్నీ స్కిట్ లో భాగంగా తనకు ముద్దు కావాలని అని హైపర్ ఆది హిందీలో చెబుతాడు.
అయితే శ్రద్ధాదాస్ ని ఏమని అడగాలో.. యాంకర్ ప్రదీప్ తోపాటు జడ్జిలు ఆనీ మాస్టర్ చెబుతుంటారు. కిస్ అనే పదాన్ని హిందీలో థప్పడ్ అంటారని ప్రదీప్ చెప్పగా, హైపర్ ఆది శ్రద్ధాదాస్ తో అలానే అన్నాడు. ఆమె చెంపపై ముద్దు పెడుతుందేమోనని ఆశగా ఎదురుచూసిన ఆదికి… ఫట్ ఫట్ మని చెంపదెబ్బలు తగిలాయి. ఇక ఆ తర్వాత హగ్ కోసం హిందీలో అడగ్గా.. ఆమె ఛాతీపై పంచులు గుద్దింది. ఇలా ఫన్నీగా ఉన్న ఈ ప్రోమో ఎపిసోడ్ పై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.