తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. బుల్లితెరపై తిరుగులేని స్టార్డమ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. ఈ షోకి మొన్నటివరకూ హోస్ట్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం సుధీర్ సినిమాలతో బిజీ అయిన కారణంగా హోస్ట్ గా యాంకర్ రష్మీ చేరినట్లు తెలుస్తుంది. అయితే.. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న కొత్తవాళ్లను పరిచయం చేస్తూ.. ఇన్స్పైరింగ్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇక తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమో అంతా కూడా చాలా సరదాగా సాగినప్పటికీ, యాంకర్ రష్మీ డాన్స్, పెర్ఫార్మన్స్, హైపర్ ఆది పంచులు హైలైట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రోమో ప్రారంభం నుండే హైపర్ ఆది.. యాంకర్ రష్మీపై పంచులు వేస్తూ ఆట పట్టించడం జరిగింది. కానీ ఎప్పటిలాగే రష్మీపై కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసాడని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. రష్మీపై ఆది పంచులు శృతిమించాయని నెటిజన్లు భావిస్తున్నారు.
ఇంతకీ హైపర్ ఆది ఏమన్నాడు? రష్మీ రియాక్షన్ ఏంటనేది చూసినట్లయితే.. రష్మీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని.. విశ్వాసం బదులుగా విశ్వక్ సేన్ అని పలికింది. ఆ తర్వాత కామెడీకి పెద్దపీట వేస్తానని అనబోయి పెద్ద పైట వేస్తానని చెప్పింది. అంతే.. వెంటనే అందుకున్న ఆది.. “పెద్దపైటేనా.. కింద లంగావోణి వేయవా” అంటూ కామెంట్స్ చేశాడు. రష్మీకి ఎలాగో తెలుగు సరిగ్గా పలకడం రాదని తెలుసు. అయినాసరే హైపర్ ఆది అలా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైపర్ ఆది మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి హైపర్ ఆది కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.