తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ యాంకర్ అనగానే ప్రదీపే గుర్తొస్తాడు. ఆ తర్వాత మనోడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే డౌట్ వస్తుంది. పెళ్లి చేసుకోకుండా అంత పాపులర్ అయ్యాడు. ఇదే విషయమై పలు ఈవెంట్స్ లో వేరే యాంకర్స్, ప్రదీప్ పై పంచులు వేస్తుంటారు. ఇప్పుడు మాత్రం పెళ్లి గురించి మాట్లాడుతూ, తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు. ఇది చూడటానికి చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపిస్తోంది. యాంకర్ ప్రదీప్ లో ఎప్పుడూ కూడా జోష్ కనిపిస్తుంది. ఆ జోషే ఇన్నేళ్ల కెరీర్ కొనసాగడానికి, ఇతడి సక్సెస్ కి కారణమైంది.
‘గడసరి అత్త సొగసరి’ లాంటి షోతో ప్రతి ఇంట్లో వాడిలా మారిపోయిన ప్రదీప్.. ఆ తర్వాత ఆ ఛానెల్ ఈ ఛానెల్.. ఈ షో ఆ షో అనే తేడా లేకుండా ప్రతి దాంట్లోనూ చేస్తూ వస్తున్నాడు. ఎక్కడిక్కడ ఎంటర్ టైన్ మెంట్స్ పీక్స్ లో ఇస్తున్నాడు. ప్రతి ఛానెల్ వాళ్లతోనే సరైన రిలేషన్ షిప్ మెంటైన్ చేస్తూ.. చిన్న పిల్లల ప్రోగ్రామ్, సింగింగ్ ప్రోగ్రామ్, డ్యాన్స్ ప్రోగ్రామ్, లేడీస్ కిట్టీ పార్టీ టైప్ ప్రోగ్రామ్.. ఇలా ఏదైనా సరే తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాడు.
దసరా సందర్భంగా జీ తెలుగులో ‘రారండోయ్ పండగ చేద్దాం’ పేరుతో ఈవెంట్ ప్లాన్ చేశాడు. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు టీవీలో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే బంగార్రాజు మీట్స్ మాచిరాజు అనే కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ప్రదీప్, తనని తానే ఇంటర్వ్యూ చేశాడు. ఊతపదం ఏంటని అడగ్గా.. నీ యంకమ్మ అని సమాధానమిచ్చాడు. మీకు నిజంగా పెళ్లయిపోయింది కదా? అని అడగ్గా.. నాలుగైదుసార్లు అయిపోయింది, యూట్యూబ్ లో చూడలేదా నువ్వు అని తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు. ‘ఆ పెళ్లి కూతురు ఎవరయ్యా?’ అని యాక్ట్ చేస్తూ కామెడీ పండించాడు. మరి ప్రదీప్ పై ప్రదీప్ కౌంటర్స్ వేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఢీ షోలో షాకింగ్ సీన్.. ప్రదీప్, హైపర్ ఆదిలకు వార్నింగ్! సెన్స్ లేదా అంటూ!