ఢీ డ్యాన్స్ షో సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే 13 సీజన్లు పూర్తి చేసుకుని.. ప్రస్తుతం 14వ సీజన్ రన్ అవుతోంది. ఎందరో ప్రతిభావంతులకు ఈ షో చక్కని వేదికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పరిచయం అయిన వారు నేడు టాప్ కోరియోగ్రాఫర్స్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ షోలో డ్యాన్స్‌తో పాటు టీమ్ లీడర్స్, యాకంర్, జడ్జెస్‌తో కలిసి చేసే ఫన్ని స్కిట్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. వీటికి కూడా మిలియన్ల కొద్ది వ్యూస్. టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ షో జూలై 27న ప్రసారం కాబోయే ఎసిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. కొరియోగ్రాఫర్ రౌండ్ కాన్సెప్ట్‌తో ఎపిసోడ్ రానుంది. ఈ క్రమంలో తాజాగా రిలీజైన ప్రోమోలో కిరణ్ మచ్చా గొడవ చేయడం సంచలనంగా మారింది ఒకరు జడ్జి శ్రద్ధా దాస్‌తో గొడవపడటం.. ఆది, ప్రదీప్‌లతో వాదనకు దిగడం.. వార్నింగ్ ఇవ్వడమే కాక.. చివరకు శ్రద్ధాదాస్ ఏడవడంతో ప్రోమో ముగుస్తుంది.
ప్రస్తుతం ఢీలో కపుల్స్, సోలో, ఛాంపియన్స్ , లేడీస్ టీమ్ల మధ్య పోటీ మొదలుపెట్టారు. ఈ నాలుగు టీములకు హైపర్ ఆది, నవ్య స్వామి, రవికృష్ణ, కిరణ్ మచ్చాలు టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. షోలో భాగంగా ఓ కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్ పర్‌ఫామెన్స్‌ని మెచ్చుకున్న శ్రద్ధదాస్ వారితో కలిసి డ్యాన్స్ చేస్తుంది. దాంతో కిరణణ్ మచ్చా లేచి.. మీరు పార్శాలిటీ చూపిస్తున్నారు.. జడ్జీ స్థానంలో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటూ వాదనకు దిగుతాడు. ప్రదీప్ నచ్చచెప్పడానికి చూస్తే.. మధ్యలో నీ ఒర్లుడు ఏంది.. అంటాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన శ్రద్ధా దాస్ సెన్స్‌లెస్ అనడంతో వివాదం మరింద ముదిరింది.
చివరకు హైపర్ ఆది కల్పించుకోవడంతో.. ఈ జోక్స్ అన్ని నా దగ్గర వేయకు అంటూ ఆదికి వార్నింగ్ ఇచ్చాడు కిరణ్ మచ్చా. దాంతో శ్రద్ధా ఏడుస్తూ.. అక్కడి నుంచి వెళ్తుంది. ఈ ప్రోమో చూస్తుంటే… పెద్ద గొడవే జరిగినట్లు అనిపిస్తుంది. కానీ ఈ వీడియో చూసిన నెటిజనులు.. మాత్రం.. అయ్యాయ్యో వద్దమ్మ.. ఇప్పటికే ఇలాంటివి చాలా చూశా. ప్రతి ఒక్కరు సూపర్‌గా చేశారు.. ఇంకెన్ని సార్లు బకరాలని చేస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామంట్స్ రూపంలో తెలయిజేయండి.