ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే పలువురు ప్రముఖులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులే కాక.. అభిమానులు విపరీతంగా బాధ పడతున్నారు. ప్రముఖ గాయని, మెలోడీ క్వీన్ నయ్యారా నూర్ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో ప్రముఖ సెలబ్రిటీ మృత్యువాత పడటం గమనార్హం. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనక రాజకీయాల్లో చేరి.. బీజేపీ తరఫున బరిలో నిలిచింది. కానీ ఓడిపోయింది. ఇలా విభిన్న రంగాల్లో గుర్తింపు తెచ్చుకుని సెలబ్రిటీ హోదా దక్కించున్న సదరు బిగ్‌బాస్ కంటెస్టెంట్.. అతి పిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ వివరాలు..
హరియాణాకు చెందిన టిక్‌టాక్ స్టార్, బిగ్‌బాస్ ఫేమ్, బీజేపీ నాయకురాలు అయినా సోనాలీ ఫొగాట్ మృతి చెందారు. సోమవారం రాత్రి గుండెపోటుతో ఆమె మరణించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. సోనాలి ఫోగట్ గోవాలో తుది శ్వాస విడిచారని.. పార్టీ నాయకులు వెల్లడించారు. సోనాలి మృతి చెందని వార్త తెలిసిన వెంటనే బీజేపీ నాయకులతో పాటు అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. సోనాలీ ఫొగాట్‌కు అప్పట్లో టిక్‌టాక్‌లో లక్షకుపైగా ఫాలోవర్స్ ఉండేవారు. తన వీడియోలతో ప్రత్యేకమైన పేరు, అభిమానులను సంపాదించుకున్నారు. ఆ మధ్య కాలంలో టిక్‌టాక్‌లో సోనాలి చేసిన పలు వీడియోలు వైరల్‌గా మారాయి.
టిక్‌టాక్‌లో వచ్చిన పాపులారిటీ వల్ల ఆమెకు బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని బుల్లితెరపై సందడి చేశారు. ఇక టిక్‌టాక్ స్టార్ అయిన సోనాలీకి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సోనాలీ.. హరియాణాలోని ఆదంపుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇటీవలే పార్టీలో చేరిన కుల్దీప్ బిష్ణోయ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇది ఇలా ఉండగా.. సోనాలీ భర్త సంజయ్ ఫొగాట్ 2016లో చనిపోయారు. ఆమె మృతిపై పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Her Last Instagram Story was With a Song “Pal Do Pal”
Sonali was 42 years old Brave Single Mother and Nobody had even predicted about this news.#sonaliphogat #sonali #sonaliphogatdeath #bjpleader #heartattack #cardiac #cardiacarrest #salmankhan #biggboss #bigboss #breakingnews pic.twitter.com/jg7GuBfgia— Bollywood City (@ibollywoodcity) August 23, 2022