సంగీత ప్రపంచంలో మరో లెజెండరీ స్టార్ నేలరాలింది. ప్రముఖ గాయని నయ్యారా నూర్ కరాచీలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నూర్.. ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం నూర్ వయసు 71 సంవత్సరాలు. పాకిస్తాన్ లోని గొప్ప గాయనీమణులలో ఒకరైన నూర్ కి 'నైటింగేల్ ఆఫ్ పాకిస్తాన్'(బుల్ బుల్-ఎ-పాకిస్తాన్) అనే బిరుదు లభించింది. ఇక నయ్యారా నూర్ 1950 నవంబర్ లో భారతదేశంలోని గౌహతి(అస్సాం)లో జన్మించింది. చిన్నతనంలోనే తన కుటుంబం పాకిస్తాన్ రాజధాని కరాచీకి మకాం మార్చడంతో అక్కడే ఉండిపోయింది. లాహోర్ లోని 'నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్' కాలేజీలో విద్యను అభ్యసించిన అనంతరం.. 60లలో సింగర్ గా టెలివిజన్ రంగంలో అరంగేట్రం చేసింది. కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన నూర్.. ప్రసిద్ధ విప్లవ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన రచనలను 1976లో ఆలపించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ పరంగా 'సోహ్ని ధరి'తో పాటు గుర్తుండిపోయే దేశభక్తి పాటలు, ఎన్నో పాకిస్థానీ సినిమా పాటలను పాడారు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో నూర్ ఎన్నో ప్రశంసలు, పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 1973లో ఘరానా చిత్రానికి గాను 'బెస్ట్ సింగర్'గా నూర్ నిగర్ అవార్డు అందుకున్నారు. ఇక ఆర్ట్స్ లో నూర్ చేసిన సేవలకు గాను 2006లో ప్రభుత్వం ఆమెకు 'ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్' అవార్డు అందించింది. ఇదిలా ఉండగా.. నయ్యారా నూర్ సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదట. అదీగాక సింగర్ అవుతానని, సింగింగ్ లోకి రావాలని కూడా నూర్ అనుకోలేదని తెలుస్తుంది. కాలేజీ రోజుల్లో తన ప్రదర్శన చూసి, ఓ ప్రొఫెసర్ సింగింగ్ లో కెరీర్ కంటిన్యూ చేయమని ప్రోత్సహించినట్లు ఆమె గతంలో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక నూర్ 2012లో పాటలు పాడటం విరమించుకున్నారు. నటుడు షెహ్ర్యార్ జైదీని వివాహం చేసుకున్న నూర్ కి.. నాద్-ఎ-అలీ జైదీ, జాఫర్ జైదీ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిద్దరూ కూడా సంగీతంలో సేవలు అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం నయ్యారా నూర్ మృతితో అటు అభిమానులలో, ఇటు ఇండస్ట్రీ వర్గాలలో విషాదం నెలకొంది. Karachi: Nayyara Noor's funeral prayer will be offered at Masjid & Imambargah Yasrub DHA Ph-4 today at 4PM. Her work for Pakistan will always be remembered. #NayyaraNoor pic.twitter.com/qyUcJue9zB — Thinking Of Karachi (@ThinkingKarachi) August 20, 2022 Pakistan’s Melody Queen, Nayyara Noor passed away. What an amazing person she was. Many understood Faiz Ahmed Faiz because of her singing his revolutionary poetry. May Allah bless her soul. pic.twitter.com/6fBdOkkVf2 — Azhar Abbas (@AzharAbbas3) August 20, 2022 Madam #NayyaraNoor is no more with us.. May her soul rest in peace.. This is her picture from Lahore's last visit. INNA LILHI WAINA ILAHIR RAJIUN pic.twitter.com/RcEGqGx1t9 — Muhammad Ahmed (@ahmedanchor1) August 20, 2022