SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » These Are The Reasons Behind Krishnam Raju Not Getting Governor Post Details In Telugu

Krishnam Raju: కృష్ణంరాజుకి గవర్నర్ పదవి దక్కకపోవడానికి కారణాలు!

  • Written By: Dharani
  • Updated On - Mon - 12 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Krishnam Raju: కృష్ణంరాజుకి గవర్నర్ పదవి దక్కకపోవడానికి కారణాలు!

అసలు పేరు ఉప్పలపాటి కృష్ణంరాజు.. కానీ అభిమానులు ఆయనకు పెట్టుకున్న ముద్దు పేరు రెబల్‌ స్టార్‌. వందలాది చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ఇక రీల్‌ మీద హీరోగా మాత్రమే కాక.. రియల్‌గా కూడా మంచి మనసున్న మారాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణంరాజు మృతితో ఆయన కుటుంబంలోనే కాక ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఇక సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు కృష్ణంరాజు. 1991 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన బీజేపీలో చేరారు. అది ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చింది.

ఈ క్రమంలో1998 సంవత్సరం జరగిన ఎన్నికల్లో కృష్ణంరాజు బీజేపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి భారీ అధిక్యంతో గెలుపొందారు. అయితే విజయం సాధించినప్పటికి ఆయన ఏడాది కాలం మాత్రమే కాకినాడ ఎంపీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ ఆధిక్యంతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఇక రెండో సారి కూడా ఎంపీగా విజయం సాధించడంతో ఆయనను కేంద్రమంత్రి పదవి వరించింది. 2000 నుంచి 2004 వరకు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.

2004 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి నరసాపురం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత కొంత కాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. కృష్ణంరాజు తిరిగి 2013లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి కాషాయ పార్టీతో మంచి సంబంధాలు కొనసాగించారు కృష్ణంరాజు. ఈ క్రjpమంలోనే ఆయనకు గవర్నర్‌ పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. కేంద్రమంత్రిగా పని చేసినప్పటికి.. గవర్నర్‌ హోదాలో బాధ్యతలు నిర్వహించాలనే కోరిక కృష్ణంరాజుకు బలంగా ఉండేదని ఆయన సన్నిహితులు చెబుతారు.

ఈ క్రమంలో 2019 ఎన్నికల తరువాత నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కృష్ణంరాజుకు గవర్నర్‌ పదవి ఇస్తారని.. తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారని జోరుగా ప్రచారం సాగింది. అంతేకాక మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణంరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయనతో సమావేశం అయ్యారు. దాంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయ్యింది. కానీ ఆ తర్వాత కృష్ణంరాజు రాజకీయాలకూ పూర్తిగా దూరమయ్యారు. గవర్నర్‌ పదవిపై కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. అందుకు దాని గురించి ఎప్పుడు చర్చకు కూడా రాలేదని అన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Syamala Devi Uppalapati (@usyamala)

  • ఇది కూడా చదవండి: టాలీవుడ్ ‘మర్యాద రామన్న’ కృష్ణంరాజు .. ప్రభాస్ కూడా సేమ్ అలానే
  • ఇది కూడా చదవండి: తమ్ముడి కొడుకులా కాదు.. కన్న కొడుకులా! ప్రభాస్ అంటే కృష్ణంరాజుకి అంత ఇష్టం!

Tags :

  • bjp
  • Krishnam Raju
  • Movie News
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam