వెండితెర 'భక్త కన్నప్ప' ఇకలేరు. కృష్ణంరాజు లాంటి రెబల్ స్టార్ మరొకరు రారు. అంతలా ఆయన సినీ ప్రస్థానం ఇండస్ట్రీలో కొనసాగించారు. ఎంతోమంది యువనటీనటులకు కృష్ణంరాజు సినీ జర్నీ స్ఫూర్తి. తెరపై రెబల్ తరహా పాత్రలు చేసిన ఈయన.. తెరవెనక మాత్రం మర్యాదరామన్న. ఎందుకంటే ప్రేమతో అందరికీ ఫుడ్ పెట్టేవారు. వద్దన్నా సరే వదిలేరు వారు కాదు. కృష్ణంరాజు అంటే ఆరడగుల పైనే ఎత్తు. రెబల్ స్టార్ అనే పదానికి నిలువెత్తు ఉదాహరణలా ఉంటారు. అలాంటి ఆయన చూడ్డాడానికే కటువుగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ మనసు మాత్రం వెన్న. అతిథి మర్యాదలో ఆయనకు ఆయనే సాటి. కృష్ణంరాజు షూటింగ్ కి వచ్చారంటే.. సెట్ లో ఉన్నవాళ్లందరికీ భోజనం ఈయన ఇంటిదగ్గర నుంచే. తన టీమ్ ని అంత బాగా చూసుకునేవారు. సెట్ కి భోజనం తీసుకెళ్లడమే కాదు.. వద్దు అన్నా సరే అస్సలు ఊరుకునే వారు కాదు కృష్ణంరాజు.. కొసరి కొసరి అంటూ ప్రతి ఒక్కరూ కూడా కడుపునిండా తినేంత వరకు ఊరుకునేవారు కాదట. అందుకే ఆయన్ని మర్యాద రామన్న అని పిలిచేవారు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ కూడా నటనతో పాటు ఆతిథ్యం విషయంలో సేమ్ రూట్ లో వెళ్తున్నాడు. తన తోటీ నటీనటులకు ఫుడ్ పెట్టే విషయంలో ఏ మాత్రం మొహమాటం చూపించడు. మరోవైపు కృష్ణంరాజు అప్పట్లోనే వేటకు వెళ్లేవారు. వేటాడిన దాన్ని అడవిలోనే వండుకుని తినేవారట. తనకు అన్నం వార్చడం రాదని, చాలాసార్లు చేతులు కాల్చుకున్నానని స్వయంగా కృష్ణంరాజు.. ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. ఏదో సరదాగా చేసిన ఆ పనిని, కొంతకాలం తర్వాత మానేసినట్లుగా తెలిపారు. అలానే ఈయనకు పెసరట్టు, నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పలు ఇంటర్వ్యూల్లో బయటపెట్టారు. మరి కృష్ణంరాజు ఆతిథ్యం, దాన్ని ప్రభాస్ కూడా కొనసాగిస్తుండటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇదీ చదవండి: కృష్ణంరాజుకి రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే? ఇదీ చదవండి: రెబల్ కృష్ణంరాజు జీవితంలో మీకు తెలియని విశేషాలు!