శ్రీముఖి తన గ్లామరస్‌తో తెలుగు యాంకర్‌గా రాణిస్తుస్తోంది. పటాస్ కార్యక్రమం ఆమెకు మంచి పేరు తెచ్చింది. బిగ్ బాస్ సీజన్ -3 ప్రొగ్రాంలో పాల్గొని సందడి చేసింది. ముందుగా వెండి తెరపైకి వచ్చిన ఈ చిన్నదీ.. ఆ తర్వాత బుల్లి తెరపై తన మాటలతో గారడీ చేస్తోంది.
బుల్లి తెరపై చాలా మంది యాంకర్స్ సందడి చేస్తుంటారు కానీ కొందరే తమ స్టైల్‌లో టాలెంట్ ని నిరూపించుకుంటారు. అలాంటి వారిలో శ్రీముఖి కూడా ఒకరు. ఈ అందాల భామను బుల్లితెర రాములమ్మ అని కూడా పిలుస్తారు. శ్రీముఖి తన గ్లామరస్‌తో తెలుగు యాంకర్‌గా రాణిస్తుస్తోంది. పటాస్ కార్యక్రమం ఆమెకు మంచి పేరు తెచ్చింది. బిగ్ బాస్ సీజన్ -3 ప్రొగ్రాంలో పాల్గొని సందడి చేసింది. ముందుగా వెండి తెరపైకి వచ్చిన ఈ చిన్నదీ.. ఆ తర్వాత బుల్లి తెరపై తన మాటలతో గారడీ చేస్తోంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నదీ తాజాగా ఓ పోస్టు చేయడంతో కామెంట్స్ వెల్లువలా వస్తున్నాయి.
అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో వెండితెరపై ప్రవేశించింది ఈ అందం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ, ఇష్క్ కాదల్, చంద్రిక, నేను శైలజ, బీటెక్ బబ్లూ, క్రేజీ అంకుల్స్ వంటి సినిమాలతో మెరిసింది. కెరీర్ మొదట్లో చిన్న క్యారెక్టర్స్‌తో మెరిసిన బ్యూటీ ఇప్పుడు టీవీ షోలు, మూవీ ఈవెంట్స్‌లలో తనదైన శైలిలో రాణిస్తుంది. ముద్దు మాటలతో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది. టీవీ షోలకు యాంకర్‌గానే కాకుండా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈ బిజీ షెడ్యూల్‌లో కూడా శ్రీముఖి తన అభిప్రాయాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ అందం ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటుంది.
తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా థాయిలాండ్ వెళ్లింది ఈ అమ్మడు. ఫుకెట్ నగరంలోని జూ పార్క్‌ను సందర్శించింది. జూలో ఆరు పులులతో ఫొటోలు తీసుకుని సందడి చేసింది. అక్కడ పెద్దపులిని తాకుతూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి ధైర్యానికి మెచ్చుకుంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.శ్రీముఖి ధైర్యానికి ఏదైనా లొంగాల్సిందేనని కొందరు అక్క ఏమాత్రం తేడా కొట్టిన అంతే సంగతులు జర జాగ్రత్త అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. శ్రీముఖి పులులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.