Tejaswi Madivada: తేజస్వి మదివాడ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేరింత సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది తేజస్వి. తాజాగా, కమిట్‌మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమిట్‌మెంట్ సినిమా ప్రమోషన్ల సందర్బంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షో ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది. కౌశల్ ఆర్మీతో తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే దిమ్మతిరిగిపోయింది. సినిమాలు అన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్, కౌశల్ మండా ఆర్మీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎటాక్ అని నేను ఫీల్ అయ్యాను.
ఎందుకంటే.. నేను ఒక అమ్మాయిని, నా దగ్గర ఏముందని నన్ను ఇంతలా అటాక్ చేస్తున్నారు. మీమ్స్ చేసి, పాడు పనులు చేసి. దాని వల్ల ఉపయోగం ఎవరికీ లేదు. వాడొకడు లైఫ్‌లో ముందుకు వెళ్లటానికి కావచ్చు. కానీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడు. అతడు ఎక్కడా లేడు. కానీ, అది జరిగిన తర్వాత నేను చాలా డిప్రెస్ అయ్యాను. సినిమాలు వదిలేద్దామనుకున్నాను. రెండున్నర సంవత్సరాలు ఇండియాలో లేకుండా.. బయటి దేశాల్లో ఒంటరిగా తిరిగేదాన్ని.. బిగ్‌బాస్ షో అయిపోయిన తర్వాత నేను ఎంతో హ్యాపీగా బయటకు వచ్చా.
కానీ, నేను బయటకు రాగానే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. ఏంటా అని చూస్తే.. మీమ్స్, బూతులు.. ఇష్టం వచ్చినట్లు చేశారు. అందుకే సినిమాలు వదిలేశాను. కానీ, చాలాకాలం తర్వాత కమిట్‌మెంట్ వచ్చింది. సినిమాల్లోకి మళ్లీ వచ్చాను. సినిమాలో చూస్తే నేను బాగుండను. ముఖం లావెక్కిపోయి, షేప్‌లో లేకుండా ఉంటాను. ఎందుకంటే.. ఫుల్లు తాగేశాను. నా బాధల్ని అలా తీర్చుకున్నా’’ అని చెప్పుకొచ్చింది. మరి, కౌశల్ మండా ఆర్మీపై, కౌశల్‌పై తేజస్వి మదివాడ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ‘బిజినెస్ మేన్’ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్..?