డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించిన ఈ సినిమా ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసిన లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అలాగే దర్శకుడు పూరి కూడా లైగర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక లైగర్ రిలీజ్ ముందే మరో పూరి తీసిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ అంటూ వార్తలు బయటికి వచ్చాయి. పూరి జగన్నాథ్ హిట్ అయిన చాలా సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్ అవ్వడమే కాకుండా.. అక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు పూరి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ 'బిసినెస్ మేన్' సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించగా.. ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు వినిపిస్తుండటం గమనార్హం. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులోని ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ తరుణంలో పూరి సరదాగా బిజినెస్ మేన్ సినిమాను హిందీలో రీమేక్ చేసుకోవచ్చని అనగానే.. బెల్లంకొండ శ్రీనివాస్ ఆశగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే.. బిజినెస్ మేన్ రీమేక్ చేయాలనుకుంటే కరణ్ జోహార్ ని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పుకొచ్చారు మీమర్స్. బిజినెస్ మేన్ సినిమా మహేష్ బాబు కెరీర్ లో మంచి హిట్ గా నిలవగా, మహేష్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మరి బిజినెస్ మేన్ రీమేక్ విషయంలో వస్తున్న ఫన్నీ మీమ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by _ | (@thopulam_mama)