బాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ నటుడితో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ గత కొన్నాళ్లుగా బాగా వినిపిస్తోంది. వీళ్లిద్దరూ పలుసార్లు మీడియా కెమెరాలకు చిక్కడం ఈ గుసగుసలకు మరింత ఊతమిచ్చింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమలో ఉందనే వార్తలు గత కొన్నాళ్లుగా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ ప్రేమాయణం నడిపిస్తోందని సోషల్ మీడియాలోనూ రూమర్స్ నడుస్తున్నాయి. వీళ్లిద్దరూ గతంలోనూ పలుమార్లు కలసి తిరిగిన టైమ్‌లో కెమెరాలకు చిక్కడంతో ప్రేమ వ్యవహారం నిజమేనని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే లవ్ రూమర్స్ మీద ఇటు తమన్నా గానీ, అటు విజయ్ వర్మ గానీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ తమన్నా-విజయ్ మళ్లీ జంటగా ప్రత్యక్షమవడంతో వీళ్లు తమ రిలేషన్ గురించి అభిమానులకు హింట్లు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ముంబైలోని ఒక రెస్టారెంట్‌కు సోమవారం వెళ్లిన ఈ జంట అక్కడి నుంచి తిరిగొస్తున్న సమయంలో కెమెరా కంటికి చిక్కారు.
అంతేకాకుండా మీడియాకు హాయ్ చెప్పారు తమన్నా-విజయ్ వర్మ. దీంతో త్వరలోనే వీళ్లిద్దరూ తమ రిలేషన్ గురించి బయటపెడతారేమోనని ఫ్యాన్స్ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే, ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల్లో ఈ జంట సన్నిహితంగా కనిపించడం, ఒక పార్టీలో తమన్నాను విజయ్ వర్మ ముద్దు పెట్టుకుంటూ కనిపించడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అనంతరం పాపులర్ సింగర్ దిల్జీత్ కాన్సర్ట్‌లోనూ ఈ జంట కనిపించింది. బాలీవుడ్లో రూపొందిన ‘లవ్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ చిత్రీకరణలో వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందని, అక్కడే వీళ్లు ప్రేమలో పడ్డారని ముంబై మీడియా టాక్.
Love birds 🫶 #TamannahBhatia #vijayvarma papped together in mumbai#tamannah@tamannaahspeaks pic.twitter.com/f1nCZgNv11
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) April 24, 2023