సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అన్నాక హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో పాటు టీవీ షోలలో కూడా పాల్గొంటుంటారు. బాగా పాపులర్ అయిన టీవీ షోలలో అయితే తప్పకుండా హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటారు. కానీ.. ఎందుకో మరి స్టార్ హీరోయిన్ తాప్సి ఓ ప్రముఖ టీవీ షో పంపిన ఆహ్వానాన్ని నిరాకరించిందట. మరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తాప్సి.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతోంది. మరి తాప్సి నిరాకరించిన టీవీ షో ఏంటి? అసలు ఏ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది? ఆ వివరాలేంటో చూద్దాం.
కొన్నేళ్లుగా తాప్సి టాలీవుడ్ కి బై చెప్పి పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే బాలీవుడ్ లో వరుస హిట్స్ పడ్డాయో.. అప్పటినుండి కంటెంట్ ప్రధానంగా సినిమాలు చేస్తోంది. అయితే.. ఇటీవల తాప్సి ‘దొబారా’ సినిమా చేసింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దొబారా మూవీకి సంబంధించి ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న తాప్సి.. ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొనట్లేదని ఖరాఖండీగా చెప్పేసిందట.
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షోకి.. బాలీవుడ్ స్టార్స్ అంతా తమ సినిమాలను ప్రమోట్ చేయొచ్చని వెళ్తుంటారు. ఆ విధంగా తాప్సి సినిమా ప్రమోట్ చేసుకునేందుకు ఈ షో నుండి ఆహ్వానం అందిందట. కానీ.. కాఫీ విత్ కరణ్ షోలో తాను పాల్గొనట్లేదని తేల్చి చెప్పేసింది తాప్సి. ఎందుకు నో చెప్పిందని ఆరా తీయగా.. తాను కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత ఆసక్తికరంగా తన శృంగార జీవితం లేదని బోల్డ్ సమాధానం చెప్పినట్లు సమాచారం.
‘కాఫీ విత్ కరణ్’ షోలో ఎవ్వరు పాల్గొన్నా హోస్ట్ కరణ్ జోహార్ ఎక్కువగా శృంగారం గురించే ప్రశ్నలు అడుగుతుంటాడు. మీరు ఏ వయసులో వర్జినిటీ కోల్పోయారు? మీ రొమాంటిక్ పార్టనర్ ఎవరు? చివరిసారిగా పడక సుఖం ఎప్పుడు పొందారు? అని ఈ టైప్ ప్రశ్నలే సంధిస్తుంటాడు. ఇటీవల విజయ్ దేవరకొండను కూడా ఆ విధమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాడు. అందుకే ఇండైరెక్ట్ గా తాను రాలేనని కౌంటర్ వేసి చెప్పిందట తాప్సి. ప్రస్తుతం తాప్సి సమాధానం నెట్టింట, బాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. దొబారా చిత్రం స్పానిష్ మిరాజ్ సినిమాకి రీమేక్. మరి ఈసారి తాప్సి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. తాప్సి సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.