క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన నటి సురేఖ వాణి. ఒకప్పుడు ఆమె లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్రలో కనిపించి మెప్పించేది. అమ్మ, అక్క, వదినగా, భార్యగా, ఇలా పలు రకాల పాత్రల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించింది. అయితే ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే సురేఖ వాణి ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. వెండితెరకు దూరంగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ముఖ్య పొట్టి దుస్తులల్లో వీరు చేస్తున్న హంగామా చూసి కొందరు నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా నెటిజన్స్ ట్రోల్స్ కి సురేఖవాణి కూతురు సుప్రీత ఘాటుగా సమాధాన ఇచ్చారు.
సురేఖ వాణి, సుప్రీతలు చూడ్డానికి తల్లికూతుళ్లలా కాకుండా స్నేహితులా ఉంటారు. వయస్సులో కూడా ఇద్దరి మధ్య అంత తేడా కనిపించదు. ఇక వీరిద్దరు కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. వీలున్నప్పుడల్లా సురేఖ వాణి, సుప్రీత ఇద్దరూ కూడా వెకేషన్స్‌కి వెళుతుంటారు. అక్కడి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే వాళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోల విషయంలో చాలా సార్లు ట్రోల్స్ కు గురయ్యారు. కొంతమంది నెటిజన్లు వీరిపై నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. భర్త చనిపోయిన బాధ కూడా సురేఖవాణికి లేదని, ఎంజాయ్ చేస్తుందంటూ రకరకాలు గా విమర్షలు గుప్పించారు. అంతే కాకుండా తల్లికూతుళ్ల డ్రెస్ సెన్స్ పై కూడా కొందరు నెగిటీవ్ కామెంట్స్ చేశారు. వాటన్నిటికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రీత సమాధానం ఇచ్చారు.
“మా బట్టలు మా ఇష్టం .. మీ డబ్బులతో మీరు ఏమైనా కొని ఇస్తున్నారా? లేక మీ నుంచి మేమేమన్నా ఆశిస్తున్నామా? మిమ్మల్ని అడుగుతున్నామా? మీ పని మీరు చూసుకోకుండా మాపై మీకెందుకు అంత ఆసక్తి. నా తండ్రి చనిపోయినప్పుడు ఆయన తరపున వాళ్లు ఎవరూ రాలేదు. నా తల్లి కుటుంబం వారే అన్నీ చూసుకున్నారు. నాన్న చనిపోయాడన్న బాధ నుంచి అమ్మను బయటకు తీసుకువచ్చి.. మామూలుగా చేస్తుంటే.. రకరకాల కామెంట్స్ వినాల్సి వస్తుంది.ఈరోజు కామెంట్స్ చేసేవారు.. మాకు కష్టాలు వస్తే సాయంకి రారు. మరి అలాంటి వాళ్లు మాపై కామెంట్స్ చేయడం అవసరమా?” అంటూ నెజిజన్లపై విరుచుకుపడింది సురేఖావాణి కూతురు సుప్రీత. మరి.. సుప్రీత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Vishnu Priya: విష్ణుప్రియ సూపర్ క్యూట్ డాన్స్…