సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీల్లో మంచు విష్ణు ఒకడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మంచు విష్ణు సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికీ మేకోవర్ కూడా మొదలు పెట్టేశాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇద్దరు హీరోయిన్స్ తో మాస్ లుక్ లో విష్ణు కనిపించబోతున్న విషయం తెలిసిందే. విష్ణు గాలి నాగేశ్వరరావుగా.. సన్నీ లియోన్- పాయల్ రాజ్ పుత్ సరసన నటిస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ ఏంటనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం తన కోస్టార్ సన్నీ లియోన్ తో విష్ణు ఓ ఫన్నీ వీడియో చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: నిహారికను టార్గెట్ చేసిన వారిని కుక్కలతో పోల్చిన నాగబాబు!
ఆ వీడియోలో మంచు విష్ణు నడుచుకుంటూ వస్తుంటాడు. పిల్లర్ పక్కన దాక్కుని ఉన్న సన్నీ ఫేస్ కు మాస్క్ పెట్టుకుని ఉంటుంది. ఆమె బూ అనగానే విష్ణు భయపడడు. ఆమె ఫేస్ మాస్క్ తీయగానే సన్నీ ఫేస్ చూసి విష్ణు పరుగులు తీశాడు. బాలు సినిమాలో పవన్ కల్యాణ్– శ్రియ మధ్య జరిగిన సీన్ ను వీళ్లు మళ్లీ రిపీట్ చేశారు. విష్ణు- సన్నీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.