SumanTV Andamaina Jeevitham Programme Teenage Girl About Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. బుల్లితెర సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఇక సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సుధీర్ తత్వమే అతడికి అభిమానులను పెంచింది అనడంలో అతశయోక్తి ఏమి లేదు. మన దగ్గర సాధారణంగా సినిమా వాళ్లకు ఎంతటి వీరాభిమానులుంటారో అందరికి తెలుసు. అదిగో సుధీర్‌కు కూడా ఓ స్టార్ హీరో రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. మాములూ అభిమానులు కూడా కాదు.. పిచ్చి అభిమానులున్నారు. ఇదిగో ఈ యువతి కూడా ఆ కోవలోకే వస్తుంది. ఎందుకంటే ఆమెకి లేచినా, పడుకున్నా.. తింటున్నా.. ఏం చేస్తున్నా సుధీర్ ధ్యాసే అంటా. అంతలా అతడిపై తన అభిమానాన్ని పెంచుకుంది. అంతటితో ఆగక.. సుధీర్ పేరును తన ఒంటిపై పచ్చబొట్టు కూడా వేసుకుంది. ఇక ఈ సమస్య నుంచి బయట పడటం కోసం సదరు యువతి సుమన్ టీవీ అధ్వర్యంలో నిర్వహించే అందమైన జీవితం ప్రోగ్రాంకి కాల్ చేసింది. ఆమె సమస్య విని డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఆ వివరాలు..
అందమైన జీవితం ప్రోగ్రాంలో కాలర్స్ సమస్యలకు ఆన్సర్లు ఇస్తున్న కళ్యాణ్ చక్రవర్తికి ప్రీతి అనే యువతి ఫోన్ చేసి.. సుడిగాలి సుధీర్ పట్ల తనకున్న అభిమానం గురించి చెప్పుకొచ్చింది. ఆమె చెప్పింది అంతా విని డాక్టర్ అవాక్కయ్యారు. ఈ క్రమంలో కేవలం జబర్దస్త్ చూసేటప్పుడేనా లేదంటే.. మిగతా టైం అప్పుడు చదువుకున్నప్పుడు.. ఆట-పాట చేస్తున్నప్పుడు కూడా సుధీర్ కోసమే ఆలోచిస్తున్నావా? అని ఆ యువతిని అడిగారు.
ఇది కూడా చదవండి: నాకు ఆమే భార్యగా కావాలి! హెల్ప్ చేయండి ప్లీజ్!
దానికి ఆ యువతి.. అవును సార్ నాకు ఎప్పుడూ సుధీర్ ఆలోచనలే. కాలేజ్‌కి వెళ్లినా సరే ఎప్పుడెప్పుడు వెళ్లి సుధీర్‌ని చూద్దామా? అని అనిపిస్తుంది అని సమాధానం చెప్పడంతో.. దెబ్బకి తల పట్టుకున్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. సుధీర్ అంటే ఇష్టమా లేదంటే ప్రేమా? అని ఆ యువతిని అడగ్గా.. ‘ప్రేమే అనుకోండి.. సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం.. ప్రేమ అనే అనిపిస్తుంది. అందుకే అతని పేరుని టాటూగా కూడా వేయించుకున్నా’ అంటూ ఆన్సర్ ఇచ్చింది యువతి.
ఇది కూడా చదవండి: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ఎందుకు మానేశాడు? ఇంద్రజ ఏం చెప్పారంటే..?
యువతి సమస్య విన్న డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి.. ఆమె సమస్య గురించి వివరిస్తూ.. కుటుంబ పరిస్థితుల వల్లే ఆమె ఇలా తయారయ్యిందని.. ముందు చదవు పై శ్రద్ధ చూపమని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రావు గోపాలరావును గుర్తు చేసి నవ్వులు పూయించిన చిరంజీవి.. వీడియో వైరల్