సూపర్ స్టార్ మహేష్ బాబు-SS రాజమౌళిల కాంబినేషన్ లో పాన్ వరల్డ్ మూవీగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ఓ దేవుడుని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు జక్కన్న. మరి ఆ దేవుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్లకు ఉన్న క్రేజే వేరు. ఓ సూపర్ హిట్ డైరెక్టర్ తో స్టార్ హీరో మూవీ చేస్తున్నాడు అంటే.. ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతుంటాయి. ఇక ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చూడని కాంబినేషన్ సెట్ అయిందంటే కూడా ఆ సినిమాపై భారీగానే అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి అంచనాలు ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే.. అది సూపర్ స్టార్ మహేష్ బాబు-SS రాజమౌళిల కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ దిగ్గజ ద్వయం నుంచి ఓ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అన్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కే ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ఇన్స్పిరేషన్ ఓ దేవుడు అని తెలుస్తోంది. మరి ఆ దేవుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శక ధీరుడు SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల్లో జరిగే అడ్వెంచరల్ స్టోరీగా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతీ సినిమాకు ఇతిహాసాలను ఆదర్శంగా తీసుకునే జక్కన్న.. మహేష్ మూవీకి సైతం ఇదే ఫాలో అవుతున్నాడు. అయితే ఈసారి కథకు సంబంధించి కాకుండా క్యారెక్టర్ లో ఇతిహాసాలను జోడించినట్లు సమాచారం. ఈ పాన్ వరల్డ్ అడ్వెంచరల్ సినిమాలో మహేష్ క్యారెక్టర్ కు లార్డ్ హనుమాన్ ఇన్స్పిరేషన్ అని తెలుస్తోంది.
రామాయాణంలోని హనుమంతుడి పాత్రను ఆదర్శంగా తీసుకుని సూపర్ స్టార్ క్యారెక్టర్ ను జక్కన్న డిజైన్ చేసినట్లు సమాచారం. ఆఫ్రికన్ జంగిల్ లో దెయ్యాల లాంటి వ్యక్తులతో మహేష్ జరిపే పోరాటాలు ఒళ్లు గగుర్పోడిచే విధంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది. ఇక దాదాపు ప్రతీ సినిమాలో రామాయాణం, మహా భారతం లాంటి ఇతిహాసాలను ప్రతి బింబించే విధంగా కథను సిద్దం చేస్తాడు జక్కన్న. ఇక ఈ వార్త తెలిసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హనుమంతుడు అంటే ఎంత పవర్ ఫుల్లో.. కాబట్టి తమ హీరో క్యారెక్టర్ కూడా అంతే పవర్ ప్యాక్ గా ఉంటుందని ఊహించుకుంటున్నారు. ఇక ఈ చిత్రం పాన్ వరల్డ్ మూవీగా 2025వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
#SSMB29 directed by #SSRajamouli – #MaheshBabu‘s character is inspired by Lord Hanuman. A jungle adventure film.. pic.twitter.com/TyiU1zyiA5
— Shivam Tavar (@ShivamTavar3) April 12, 2023