చిత్రపరిశ్రమలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పలేం. ఈ రోజు లైట్ బాయ్ గా ఉన్న యువకుడు రేపు పెద్ద డైరెక్టర్ కావొచ్చు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి పెద్ద హీరో కావొచ్చు.. అలాంటి సంఘటనలు మనం ఇండస్ట్రీలో చాలానే చూశాం. ఈ క్రమంలోనే నీకు యాక్టింగ్ రాదు అని.. విజయశాంతి చేత తిట్టించుకున్న వ్యక్తే.. నేడు గొప్ప నటుడిగా కొనసాగుతున్నాడు. అతడు ఎవరా అనుకుంటున్నారా? అతడు మరెవరో కాదు.. తమిళ సినియర్ హీరో శరత్ కుమార్. మరి విజయశాంతి ఆయన్ని ఎప్పుడు? ఎందుకు తిట్టిందో మరిన్ని విషయాల్లోకి వెళితే..
శరత్ కుమార్.. కోలీవుడ్ లో సూపర్ హీరో. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. కాంచన మూవీలో ట్రాన్స్ జండర్ గా నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇటీవల కాలంలో పోలిటికల్ డ్రామాగా తెరకెక్కిన పరంపరలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మణిరత్నం తీస్తున్న పొన్నియిన్ సెల్వన్-1 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శరత్ కుమార్ తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. శరత్ కుమార్ మాట్లాడుతూ..”నేను తమిళ నటుడిని అయినప్పటికీ నా మెుదటి సినిమా తెలుగులోనే చేశాను. అప్పటికి నేను డిగ్రీ చేస్తున్నాను. నా స్నేహితుడు నిర్మాత కావడంతో ఆ సినిమా షుటింగ్ చూద్దాం అని వెళ్లా.. అయితే ఆ రోజు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాకపోయే సరికి నా ఫ్రెండ్ ఆ క్యారెక్టర్ నన్ను చేయమని బతిమిలాడాడు. నేను సరే అన్నాను..
కానీ నాకు నటన రాకపోవడంతో అప్పటికే 7,8 టేకులు తీసుకున్నాను. నేను నటించేది మరెవరితోనో కాదు అప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో. అప్పటికే ఆమె ఎంతో ఓపిక పట్టారు. చివరికి విసుగు చెంది..”నటన వచ్చిన ఆర్టిస్టులను పెట్టోచ్చు కదా! కొత్త వాళ్లని పెట్టి నా టైమ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అసలే చెన్నైకి ఉన్నది ఒక్కటే విమానం” అంటూ విసుక్కున్నారు.. అని శరత్ కుమార్ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నేను విలన్ గా బిజీగా ఉన్న రోజుల్లో మళ్లీ విజయశాంతితో నటించాల్సి వచ్చింది. ఆ షూటింగ్ లో ఆమెను కలిసి మేడం మీరు అప్పట్లో నాపై కొప్పడ్డారు అని ఆ సంఘటన గుర్తు చేశా.. దానికి ఆమె ఫీల్ అయ్యి మిమ్మల్ని తిట్టానా? అయ్యో సారీ అండి అని చెప్పారు. ఇక శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా సినిమాల్లో బిజీగా ఉంది. తనదైన విలనిజంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుని తండ్రికి తగ్గ తనయగా ఇండస్ట్రీలో ముందుకు సాగుతోంది.