అతడో కాంట్రవర్సీ డైరెక్టర్. ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశాడు. ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో చిత్రాలు తీయలేకపోతున్నాడు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ… కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకు తగ్గట్లే ట్వీట్స్ పెడుతూ ఉంటాడు. ఆయనే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. సినిమాలు, హీరో హీరోయిన్ల గురించి మాట్లాడే ఆర్జీవీ.. అప్పుడప్పుడు రాజకీయాల గురించి ప్రస్తావిస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆకాశానికెత్తేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా కల్చర్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలందరూ బాలీవుడ్ పై దృష్టిపెట్టారు. దానికి తగ్గట్లే.. మన సినిమాలతో నార్త్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. అలా ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు.. పాన్ ఇండియా స్టార్స్ అని పిలిపించుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు రెడీ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన రియల్ పాన్ ఇండియా స్టార్ అని ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు.
‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగుజాడల్లో పయనిస్తున్న టీఆర్ఎస్.. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి బీఆర్ఎస్ గా ఎంట్రీ ఇవ్వనుంది. రీల్ ఫిల్మ్ స్టార్స్ అయిన ప్రభాస్, యష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా నిలవనున్నారు’ అని ఆర్జీవీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆర్జీవీ చివరగా ‘కొండా’ మూవీ తీశాడు. ప్రముఖ పొలిటీషియన్ కొండా మురళి జీవితం ఆధారంగా దీనిని తెరకెక్కించాడు. కేసీఆర్ బయోపిక్ కూడా తీస్తానని వర్మ అప్పట్లోనే ప్రకటించాడు. కానీ దాని గురించి కొత్త అప్డేట్ అయితే ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు లేవు.
Following the footsteps of BB, RRR, PUSHPA and KGF 2 , TRS too goes PAN INDIA as BRS ..Unlike the REEL FILM STARS #Yash #Tarak #prabhas #RamCharan #AlluArjun the REAL PAN INDIA POLITICAL STAR is #KCR 💐
— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2022
ఇదీ చదవండి: టాలీవుడ్‌లో కష్టాలకి కారణం రాజమౌళినే: వర్మ