అడివి శేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హిట్: ది సెకండ్ కేస్. రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజైన తర్వాత కూడా అంచనాలకు మించి సినిమా దూసుకుపోతుంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే సన్నివేశాలతో ప్రేక్షకులను కుర్చీల్లోంచి కదలనివ్వదు. మొత్తానికి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా మొత్తం 7 భాగాలుగా వస్తుందని నిర్మాత నాని చెప్పకనే చెప్పారు. ఈ సినిమా మూడో పార్ట్ లో నాని నటిస్తున్న విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఈ హిట్ ఫ్రాంచైజీలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు నటిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ఈ హిట్ యూనివర్స్ లో సమంత పేరు కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది.
‘హిట్ ఫ్రాంచైజీలో వచ్చే తర్వాతి ప్రాజెక్ట్స్ లో సమంత లాంటి స్టార్ హీరోయిన్ ని తీసుకోవచ్చు కదా’ అని ఒక ఫిల్మ్ క్రిటిక్ హిట్ సినిమా మేకర్స్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయగా.. దానికి అడివి శేష్ స్పందించారు. ‘ఇదొక అద్భుతమైన ఆలోచన. ఏమంటావ్ సమంత’ అంటూ సమంతను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆడివి శేష్ ట్వీట్ కి స్పందించిన సమంత.. ‘వినడానికి ఫన్నీగా ఉంది. హిట్ సూపర్ హిట్ అయినందుకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో హిట్ ఫ్రాంచైజీలో సమంత నటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా ఈ సినిమా అవెంజర్స్ సినిమా తరహాలో తెరకెక్కుతుందని, ఏడుగురు హీరోలు ఉంటారని అంటున్నారు. ఇప్పటికే మొదటి రెండు భాగాల్లో విశ్వక్ సేన్, అడివి శేష్ నటించగా.. మూడవ భాగంలో నాని నటిస్తారని అన్నారు. మిగతా నలుగురు హీరోలు ఎవరా అన్న ఆలోచనలో పడ్డారు నెటిజన్లు.
A badass cop … sounds like fun 😈
Congratulations on your super HIT🫶🏻 @AdiviSesh .. always cheering for you 🤗 https://t.co/qugCUzPGrb— Samantha (@Samanthaprabhu2) December 2, 2022