హీరోయిన్లు ఎప్పుడెప్పుడు అందాల తెర లేపుతారా? అని ఆతురతగా ఎదురుచూస్తుంటారు కుర్రకారు. అప్పుడప్పుడు పద్ధతిగా కనిపించే హీరోయిన్స్.. కొన్నిసార్లు మేమున్నాం గుర్తించండి అంటూ కాక రేపే ఫోటో షూట్ లు, అందాల ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా అలాంటి విందు భోజనమే వడ్డించింది. సినిమాల్లోనే అనుకుంటే, సినిమాలని మించిపోయే రేంజ్ లో అందాల ప్రదర్శన చేసి జనాల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అమ్మడు చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఉన్నాయి. పుష్ప 2, తమిళ సినిమా వారిసు (తెలుగులో వారసుడు) కాకుండా ఎనిమల్, మిషన్ మజ్ఞు, గుడ్ బై అనే హిందీ సినిమాలతో కూడా బిజీగా ఉంది. ఆల్రెడీ గుడ్ బై, మిషన్ మజ్ఞు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి.
యాక్చువల్ గా మిషన్ మజ్ఞు సినిమా రష్మిక మొదటి సినిమా. కానీ ఆ సినిమా రిలీజ్ కు నోచుకోకపోవడంతో దీని కంటే ముందు గుడ్ బై చిత్రం రిలీజ్ అవుతోంది. కాబట్టి రష్మికకి బాలీవుడ్ లో మొదటి సినిమా గుడ్ బై నే. అమితాబ్ బచ్చన్ నటించిన ఈ సినిమా అక్టోబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. రష్మిక కూడా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా పార్టిసిపేట్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె షార్ట్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. పింక్ కలర్ టాప్ వేసుకుని పొట్టి బట్టల్లో మతిపోగొడుతోంది. అసలే పొట్టి క్యూటీ.. ఆపై పొట్టి బట్టలు.. దోర జామకాయలా కనబడుతోంది. అయితే పొట్టి బట్టల్లో రష్మిక కాస్త ఇబ్బంది పడినట్టు కనిపిస్తోంది.
ముంబై కెమెరా మేన్లు కెమెరాలు ఎక్కడెక్కడ పెడతారో అన్న భయంతో రష్మిక తన అందాలను దాచుకునే ప్రయత్నం చేస్తుంది. కొంచెం అసౌకర్యంగానే ఫీలయినట్టుంది. పైకి నవ్వుతూ కనిపించినా, లోపల మాత్రం ‘ఇక చాలు ఆపండి రా బాబు’ అని అనుకున్నట్టు తన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చెబుతున్నాయి. ఇంత అసౌకర్యంలో కూడా కెమెరా మేన్లతో సెల్ఫీ దిగింది. అదే నేషనల్ క్రష్ కున్న గుడ్ క్వాలిటీ. మరి గుడ్ బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మికకి బ్రేక్ రావాలని ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.