చందమామ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అందాల చందమామ కాజల్ అగర్వాల్. తన అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా రాణించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లోని టాప్ హీరోలందరితోనూ నటించిన ఈ హీరోయిన్ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ఇక పుట్టిన బిడ్డ అలనా పాలనా చూసుకుంటూ ఉంది. కాగా ఈ హీరోయిన్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ఇందులో గుర్రపు స్వారీ చేస్తూ కాస్త చెమటోడ్చుతుంది. దీంతో ఈ అందాల చందమామ మళ్లీ కెమెరా ముందుకు రానుందేమేనని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. ఆమె చేసిన ఈ ట్విట్ లో.. నేను నాలుగు నెలల తర్వాత తిరిగి ఫిట్ నెస్ ప్రారంభిస్తున్నాను. శారరీక శ్రమను నేను, నా బిడ్డ చాలా ఎక్కువ రోజులు భరిస్తూ వచ్చాం. తిరిగి మేము మళ్లీ అనుభవించాము. తిరిగి నా ఎనర్జీని సంపాదించుకోవడం చాలా కష్టంగా మారింది. మన శరీరాలు మారోచ్చు కానీ, మన స్పిరిట్ ను కనబరుస్తూనే ఉండాలి అంటూ హీరోయిన్ కాజల్ పోస్ట్ చేసింది.
Eager and excited,I jumped back into work 4 months post-partum!Little did I realise that it would feel like starting from https://t.co/IRSdCVhtVS body wasn’t the same as how it used to be.Pre baby,I could endure very long workdays with taxing amounts of physical activity AND then pic.twitter.com/euvegUWTJ7
— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 21, 2022