‘రష్మీ గౌతమ్’ బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు. కామెడీ షోతో అనసూయ తర్వాత మంచి యాంకర్ గా పేరందుకుంది. చాలా షోలలో తన యాంకరింగ్, అందం, అభినయం, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా తళుక్కుమని తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రష్మీపై సోషల్ మీడియాలో కామెంట్స్, మీమ్స్ వస్తూనే ఉంటాయి. అంతెందుకు ఆమె చేసే షోలోనే ఆమె తెలుగు భాషపై కౌంటర్స్ వేస్తుంటారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
అలాంటి ఆమె ఎప్పుడూ తనపై వస్తున్న విమర్శలపై స్పందించదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ పోస్టు చేసింది. ఒక అమ్మాయి సక్సెస్ అయ్యిందంటే ఆమె గురించి ఎలాంటి మాటలు మాట్లాడతారు అనే విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. ‘ఒక అమ్మాయి ఉన్నత స్థానానికి చేరుకుంది అంటే.. ఆమెను చూసి చాలా మంది అనే మాట.. కచ్చితంగా తాను ఎంతో మందికి బెడ్ షేర్ చేసుకుని ఉంటుంది’ అని ఆ పోస్ట్ లో ఉంది.
ఒక వ్యక్తి ఏదైనా తన స్టేటస్, స్టోరీలు పెట్టారు అంటే అది వాళ్లకు నచ్చి పెడతారు. వాళ్లకు నచ్చింది అంటే.. కచ్చితంగా వారికి ఆ పరిస్థితి ఎదురై ఉండాలి. అంటే రష్మీ కూడా అలాంటి ఘటనలు ఎదుర్కొని ఉండచ్చు. అందుకే అలాంటి అభిప్రాయాన్ని వ్యక్త పరిచందంటూ కామెంట్ చేస్తున్నారు. రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కొనసాగుతోంది. నందుతో కలిసి బ్లాక్ బస్టర్ అనే సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. రష్మీ పెట్టిన స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.