హీరో రానా, తన వైఫ్ తో చాలా రోజుల తర్వాత బయట కనిపించాడు. అది కూడా ఓ పెళ్లి కావడంతో చూడ్డాడానికి కలర్ ఫుల్ గా ఉన్నారు. ఇక రానా భార్య మిహిక వేసుకున్న లెహంగా కాస్ట్ తెలిస్తే మీరు అవాక్కవడం గ్యారంటీ.
ఇక వివరాల్లోకి వెళ్తే… కొన్నాళ్ల క్రితం నుంచి హీరో రానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని తన భార్య ఇన్ స్టా ద్వారా వెల్లడించాడు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత రానా, తన భార్య మిహికతో కలిసి జంటగా కనిపించాడు. ముంబయిలోని తమ కజిన్ పెళ్లిలో సందడి చేశారు. ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ అయిన కృనాల్ రావల్, అప్రిత మెహతాల వెడ్డింగ్ తాజాగా జరిగింది.
ఈ వేడుకలోనే కనిపించిన రానా వైఫ్ మిహిక.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఆమె ధరించిన లెహంగా అయితే గోల్డ్ ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది. దాని కాస్ట్ రూ.3 లక్షల రూపాయలకు పైనే. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ కావడంతో.. రానా-మిహికతో పాటు ఆమె వేసుకున్న డ్రస్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి చాలారోజుల తర్వాత రానా, తన వైఫ్ తో కనిపించడం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చూడండి: మీరు చూడని రానా దగ్గుబాటి, మిహిక బజాజ్‌ల పెళ్లి ఫొటోస్!