Rana Daggubati: ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ దంపతుల్లో రానా, మిహిక బజాజ్‌ల జంట ఒకటి. ఈ జంట 2020 ఆగస్టు 8న మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. రానా తన పెళ్లి గురించి చెప్పటం, మిహికను పరిచయం చేయటం.. పెళ్లయిపోవటం జెట్ స్పీడుతో జరిగిపోయాయి. రామానాయుడు స్టూడియోలో జరిగిన వీరి పెళ్లికి దాదాపు 30 మంది దాకా బంధువులు, మిత్రులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక, అప్పటినుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటోంది. సోమవారంతో ఈ జంట పెళ్లి చేసుకుని రెండేళ్లు అయింది. ఈ సందర్భంగా ఈ జంట సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలు జరుపుకుంది. ఈ నేపథ్యంలో మిహిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త రానాతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ గురించి రాసుకొచ్చింది. ఇక, ఈ రోజు సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న ఈ జంటకు సంబంధించిన మీరు చూడని పెళ్లి ఫొటోలు మీకోసం.. #RanaMiheekaWedding pic.twitter.com/ceSLIkg6gy — Suresh Productions (@SureshProdns) August 9, 2020 View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) ఇవి కూడా చదవండి : చిరంజీవి స్టైలిష్ లుక్ పై బండ్ల గణేష్ కామెంట్స్!