మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు ఉపాసన. మెగా కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, తన భర్త రామ్ చరణ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు ఉపాసన. ఈ క్రమంలో తాజాగా ఉపాసన.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరలయ్యాయి. ఫోటోలను పోస్ట్ చేస్తూ.. వెకేషన్ కోసం వేయిటింగ్ అనే క్యాప్షన్ జత చేసింది ఉపాసన.
ఇది కూడా చదవండి: నువ్ నన్ను వదిలేసి వెళ్లిపోయావ్.. బాగా మిస్ అవుతున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్
ఆమె పోస్ట్‌కు చరణ్ స్పందిస్తూ.. ‘‘ఉపాసన నా మనసులో కూడా హాలీడేకు వెళ్లాలని ఉంది.. అయితే #RC15 షూట్ విశాఖలో జరుగుతోన్న కారణంగా మనం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే’’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే రామ్ చరణ్, చిరంజీవి నటించిన ‘ఆచార్య’ విడుదల అయిన వెంటనే చరణ్.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సెట్ లో అడుగుపెట్టాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్ లో వెళ్లింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కోలుకున్న సాయి ధరమ్ తేజ్. అంతా ఉపాసన దయేనా? మెగాకోడలు కాదు.. ఆ ఇంటి దేవత!