మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి తొలిసారి వెండితెరపై ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించబోతున్న సినిమా ఆచార్య. ఇద్దరు సూపర్ స్టార్లను ఒకేసారి తెర మీద చూడ్డానికి మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ల నుంచి ఊరిస్తూ వచ్చిన ఈ క్రేజీ కాంబినేషన్ మరి కొద్ది రోజుల్లో అనగా.. ఏప్రిల్ 29వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రామ్ చరణ్.
‘‘నేను, నాన్న ఇద్దరం కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు కనిపించాలని మా అమ్మ కోరిక. దానికి తగ్గట్టే ఆచార్య స్క్రిప్ట్ కుదిరింది. అదే సమయానికి నేను RRR సినిమా చేస్తున్నాను. ఆచార్య సినిమాలోని నా క్యారెక్టర్ సిద్ద లుక్ కూడా RRRలోని నా లుక్‌కి కాస్త దగ్గరగా ఉండటం లక్కీగా కలిసొచ్చింది’’ అని తెలిపాడు. అయితే రాజమౌళితో పని చేసే సమయంలో మధ్యలో మరో సినిమా చేయడానికి అవకాశం ఇవ్వడని టాక్. కానీ చిరంజీవి వచ్చి రాజమౌళిని రిక్వెస్ట్ చేయడంతో.. రామ్‌చరణ్‌కి కాస్త ఫ్రీ సమయం ఇచ్చారనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తుంది.
ఇది కూడా చదవండి: ఖాసా సరిహద్దుల్లో జవాన్లతో రామ్ చరణ్.. ఫోటోలు వైరల్!ఇక షూటింగ్ విషేశాలను పంచుకుని రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘నాకూ, డాడీకి షూటింగ్‌కి వీలుగా ఉండేలా ఒక డబుల్‌బెడ్రూం ఇంటిని ఇచ్చారు. అక్కడ దాదాపు 20రోజులు నేను, డాడీ కలిసి నిద్రలేవడం, కలిసి భోజనం చేసేవాళ్లం. ప్రతీ రోజు మార్నింగ్ 5:30 గంటలకు లేచి కలిసి వర్కవుట్ చేశాం. రోజూ కలిసి షూటింగ్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యేవాళ్లం. అలానే సెట్స్‌లో ఇద్దరం కలిసి పని చేశాం. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఒకే కార్‌లో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళం. ఈ క్షణాలన్నీ నాకు ఎంతో మధురమైనవి, నాన్నతో ప్రయాణం చేస్తున్న దాని గురించి నా ఫీలింగ్స్‌ను మాటల్లో వర్ణించలేను’’ అన్నాడు.
ఇది కూడా చదవండి: ఆచార్య మూవీపై అంచనాలు పెంచేసిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను!
‘‘ఇక నాకు ఇలా ఉంటే నాన్న అక్కడ ఓ రోజు చరణ్ నీకు అర్ధం కావడం లేదేమో దీని వాల్యూ. ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు. ‘ఆచార్య’ వల్ల మనకు ఈ అవకాశం వచ్చింది. షూటింగ్‌కి ముందు లేదా తరువాత ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేద్దాం. మళ్లీ నీతో నాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇంత మంచి కథలో మనం కలిసి నటించడం ప్రతిసారీ కుదరదు అన్నాడు. నాన్న నన్ను హత్తుకున్నపుడు నాకు కన్నీళ్లు వచ్చాయంటూ’’ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. ఇలా ‘ఆచార్య’ చిత్రం తమకు చాలా స్పెషల్ అంటూ తన తండ్రి చిరంజీవిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
ఇది కూడా చదవండి: ఆచార్య సెట్ లో చిరు-రామ్ చరణ్ మదర్స్ మధ్య పోటీ!
ఇక రామ్ చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం పాన్ ఇండియా లెవల్లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెర్రి, దర్శకుడు శంకర్‌తో చేస్తున్న చిత్రంపై ఫుల్‌గా ఫోకస్ పెట్టి జెట్‌స్పీడ్‌లో షూటింగ్ కొనసాగిస్తున్నాడు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.