మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. 'నాటు నాటు' పాటలో అదిరిపోయే డ్యాన్స్ చేసిన చెర్రీ, ఆస్కార్ రాకతో మరింత ఫేమస్ అయ్యారు. తాజాగా తన భార్య గురించి ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు.
చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత తన అద్భుతమైన నటనతో గోబ్లల్ స్టార్ గా ఎదిగారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తెలుగు చిత్ర పరిశ్రమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం గోబ్లల్ స్టార్ గా మారారు. ఎన్టీఆర్, చెర్రీ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఖండాంతరాలు దాటింది. ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ పాట కేటగిరిలో ఆస్కార్ అవార్డు లభించింది. ఇలా ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖ్యాతి ఖండాంతారాలు దాటింది. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. చెర్రీకి దైవభక్తి ఎక్కువనే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఎన్నో సార్లు అయ్యప్పమాలలో దర్శనమిచ్చారు. అయితే తాజాగా చెర్రీ, ఉపాసన దంపతుల గురించి ఓ ఆస్తకరమైన విషయం ఒకటి తెలిసింది. మరి.. అది ఏమిటో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జోడీ ఒకటి. వీరిద్దరికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరు తమ కెరీర్ పరంగా ఎంతో ఎదుగుతుండగా.. మరో వైపు దైవభక్తిలో మునిగిపోతారు. ముఖ్యం రామ్ చరణ్ కి దైవభక్తి చాలా మెండు అనే విషయం మనకి తెలిసిందే. ఇప్పటికే ఆయన అయ్యప్ప మాలలో పూజలు చేస్తూ మనకు కనిపించారు. అలానే రామ్ చరణ్ దంపతులు తరచూ వివిధ రకాల పూజ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇలా దైవ చింతనలో ఉండే ఈ దంపతులకు సంబంధించి ఓ ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. రామ్ చరణ్ దంపతులు ఓ చిన్న టెంపుల్ ను ఎక్కడి వెళ్లిన తమ వెంట తీసుకెళ్తుంటారు.
సీతారాముల విగ్రహాలు ఉండే ఓ చిన్న టెంపుల్ ను రామ్ చరణ్ దంపతులు ఎక్కడి వెళ్లిన తమ వెంట తీసుకెళ్తారు. ఈ టెంపు తమ వెంట ఉండే అంత మంచే జరుగుతుందని, అలానే అనుకున్న పనులు విజయం సాధిస్తాయని ఆ దంపతులు బలంగా నమ్ముతారు. అందుకే ఇటీవలే ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా అమెరికా వెళ్లిన రామ్ చరణ్ దంపతులు సీతారాముల టెంపుల్ ను తమ వెంట తీసుకెళ్లారు. విదేశీయాత్రలకు వెళ్లినా, ముఖ్యమైన పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడైనా కచ్చితంగా దేవుడికి పూజలు చేస్తామని, ఆ తర్వాతే బయటకు అడుగు పెడతామని రామ్ చరణ్ తెలిపారు. ఉపాసన ఎక్కడికి వెళ్లినా తనతో పాటు చిన్న సీతారాముల విగ్రహాలను తీసుకువెళ్తుందట. తాజాగా ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఉపాసన సీతారాముల విగ్రహాలను తీసుకెళ్లారంట.
ఈ వేడుకలో పాల్గొనడానికి వెళ్లే ముందుకు తమ హోటల్ గదిలో సీతారాముల విగ్రహాలను ఉంచి పూజలు చేశారట. ఇక ఆ దేవుళ్లను రామ్ చరణ్ చూపిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..” నా భార్య ఎక్కడికి వెళ్లినా తప్పకుండా ఈ చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తుంది. అది మాకు చాలా కాలం నుంచి అలవాటు అయ్యింది. ఈ టెంపుల్ మన ఆచారాలనే కాదు, భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది” అని చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన ఆ చిన్న ఆలయానికి పూజలు చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
. @alwaysramcharan shares with us a sacred ritual he shares with his wife😍 We are truly in love with this man! ❤️#ramcharan@alwaysramcharan#globalstarramcharan pic.twitter.com/ai1aElwNPW
— Ramesh Bala (@rameshlaus) March 14, 2023