కొన్ని రోజుల క్రితం ప్రముఖ నిర్మాత రవీందర్.. బుల్లితెర నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వార్త, ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. ఇక ఈ జంట మీద వచ్చినన్ని ట్రోల్స్ ఈ మధ్య కాలంలో మరెవరి మీద వచ్చి ఉండవు. అంత భయంకరంగా కామెంట్స్ చేశారు నెటిజనులు. మరీ ముఖ్యంగా కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి.. రవీందర్‌ని వివాహం చేసుకుందని విమర్శించారు చాలమంది. కానీ ఈ జంట మాత్రం అవేం పట్టించుకోకుండా తమ కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చారు. ట్రోలింగ్ సంగతి ఎలా ఉన్నా.. వీరికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ క్రమంలో తాజాగా మహాలక్ష్మి కోసం రవీందర్ ఏకంగా డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడనే వార్త వచ్చింది. మహాలక్ష్మి బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లడంతో.. ఆమెకు టిఫిన్ ఇవ్వడానికి డెలివరీ బాయ్‌లా వెళ్లి భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడనే వార్త తెగ వైరలయ్యింది. దాంతో చాలా మంది జనాలు.. వీరిద్దరిది నిజమైన ప్రేమ.. ఎవరు ఏమన్నా వారు మాత్రం సంతోషంగా ఉంటారు అని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరికి సంబంధించి మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరలవుతోంది. సెలబ్రెటీలు వివాహ వేడుక సందర్భంగా.. ఒకరికొకరు ఖరీదైన బహుమతులు ఇచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో వివాహం సందర్భంగా నయనతార.. విఘ్నేష్ శివన్‌కు 25 కోట్ల రూపాయల ఖరీదైన బంగ్లాను కానుకగా ఇవ్వగా.. విఘ్నేష్.. నయన్‌కు 5 కోట్ల ఖరీదైన ఆభరణాలు గిఫ్ట్‌గా ఇచ్చాడు.
అలానే నిర్మాత రవీందర్ కూడా తన భార్య మహాలక్ష్మికి.. వివాహం సందర్భంగా ఖరీదైన కానుకలు ఇచ్చాడని తెలుస్తోంది. ఏకంగా మహాలక్ష్మికి బంగారు పూత పూసిన మంచాన్ని ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా పెళ్లి సందర్భంగా మహాలక్ష్మికి ఎంత బంగార పెట్టాడనే దాని మీద జోరుగా చర్చ సాగుతోంది. రవీందర్ భార్య కోసం సుమారు ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలను తయారు చేసినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. పెళ్లి రోజు ఆమె ధరించిన బంగారం అంతా రవీందర్ చేయిందే అంటున్నారు.
ఇక మహాలక్ష్మి తొలుత యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత సీరియల్స్‌లో నటించడం ప్రారంభించింది. ఇక భర్త రవీందర్ చంద్రశేఖర్ నిర్మించిన ‘విద్యుం వారై కతిరు’ సినిమాలో కూడా మహాలక్ష్మి నటించింది. వీరిద్దరికి కూడా ఇది రెండో వివాహామే. మహాలక్ష్మికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. విమర్శలను పట్టించుకోకుండా.. ఈ జంట తమ కొత్త జీవితన్నా ఎంజాయ్ చేస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.