Ravinder And Mahalakshmi: తమిళ ప్రొడ్యూసర్ రవిందర్, సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మిల పెళ్లి గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. రవిందర్ లావుగా ఉండటం, మహాలక్ష్మి ఆయనకంటే చాలా సన్నగా ఉండటంతో ఒక్కసారిగా వీరి జంట టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా రవిందర్ మాట్లాడుతూ.. ‘‘ అందరూ ఆమెకు మాత్రమే రెండో పెళ్లి అని అనుకుంటున్నారు. ఇది నాకు కూడా రెండో పెళ్లే. ఒకటిన్నర సంవత్సరం ఇద్దరం ప్రేమించుకున్నాం. రెండు కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకున్నాం.
ఇది లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్. పెళ్లికోసం బరువు తగ్గి చూపిస్తానన్నాను. కానీ, తను వద్దని వారించింది. ఇద్దరం పెళ్లి బంధంలో సంతోషంగా ఉండగలమన్న నమ్మకంతో పెళ్లి చేసుకున్నాం’’ అని చెప్పారు. అనంతరం మహాలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ నాకు ఆయన బరువు పెద్ద సమస్యగా అనిపించలేదు. నాకు ఆయనంటే ఇష్టం. ఆయన ఎలా ఉన్నారో అలానే ఇష్టం. బరువు తగ్గి వస్తా అన్నారు. అవసరం లేదు అని చెప్పా. బరువు గురించి చాలా సార్లు మాట్లాడారు. నేను ఫారెన్ పోతాను, అక్కడికి పోతాను, ఇక్కడికిపోతాను అని అంటూనే ఉండేవారు. ప్లీజ్ అవేవీ చేయోద్దండి, మీరు ఉన్నట్లే ఉండండి అన్నాను. ఆరోగ్యం వరకు చూసుకుందాం, బరువుతాగ్గాలన్న దాని గురించి ఆలోచించటం మానేసేయండని చెప్పాను.
నాకు ఆ ఆలోచనే లేదు’’ అని అన్నారు. ఇక యూట్యూబ్ థంబ్ నేల్స్ వార్తలపై కూడా రవీందర్ స్పందించారు. ‘‘ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన థంబ్ నేల్స్ను చూసి బాగా నవ్వుకునే వాళ్లం. ఓ యూట్యూబ్ ఛానల్ ‘రవీందర్ భారీ ఖాయాన్ని చూసి కోపంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న మహాలక్ష్మి’ అని థంబ్ నేల్ పెట్టింది. అది చూసి నేను వెంటనే ఏం నిర్ణయం తీసుకుంది.. కొంపతీసి వెళ్లిపోయిందా ఏంటి అనుకుని ‘ ఏమే ఉన్నావా? పోయావా?’ అని వెనక్కు తిరిగి అరిచాను’’ అంటూ పగలబడినవ్వారు. మరి, సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chinmayi: సమంతతో ఆ ప్రయాణం ముగిసే దశ వచ్చింది: చిన్మయి