కన్ను కొడితే ఎవరైనా ఫేమస్ అవుతారా? అదీగాక స్టార్ హీరోయిన్ అయిపోతారా? అంటే మీరు నమ్మకపోవచ్చు. కానీ దాన్ని రియాలిటీలో నిజం చేసి చూపించింది ఈ భామ. మలయాళంతోపాటు తెలుగులోనూ సినిమా అవకాశాలు దక్కించుకుని హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆరేడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఆమెనే ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ.. పూల్ లో కేక పెట్టించే పోజులతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి న పనిలేదు. ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన ఈమె.. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో పుల్ బిజీగా మారిపోయింది. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. షూటింగ్ లకు కాస్త విరామమిచ్చి, ప్రస్తుతం బ్యాంకాక్ లో విహరిస్తున్న ఈమె.. స్టన్నింగ్ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా స్విమ్మింగ్ పూల్ లో తడి అందాలు చూపిస్తూ మత్తెక్కించే కళ్లతో చూస్తోంది. వీటిని చూసిన నెటిజన్స్ అయితే కన్నర్పకుండా అలానే చూస్తూనే ఉన్నారు.
ఇక ప్రియా సినిమాల విషయానికొస్తే.. తొలి సినిమా ‘ఒరు అదార్ లవ్’. ఇందులో ఈమె హీరోయిన్ కాకపోయినప్పటికీ ఫేమ్ మాత్రం తెగ సంపాదించింది. ఆ తర్వాత తెలుగులోనూ ఛాన్సులు దక్కించుకున్న ఈమె.. నితిన్ ‘చెక్’, తేజ సజ్జా ‘ఇష్క్’ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘శ్రీదేవి బంగ్లా’, 3 మంకీస్, లవ్ హ్యాకర్స్ చిత్రాలు చేస్తోంది. ఈ మూడు కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ కేరళ కుట్టి.. తడి అందాల ఫొటో షూట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.